Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
Sisira in Trending!

ఈ సంచికలో >> సినిమా >>

పవన్‌ 'తొలిప్రేమ' మ్యాజిక్‌ని వరుణ్‌ రిపీట్‌ చేస్తాడా?

Varun Repeat  Magic of Pawan's toli prema

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఓ ప్రత్యేకమైన సినిమా 'తొలిప్రేమ'. ఎందుకు ప్రత్యేకం అంటే తెలుగు సినిమాకి ఓ స్టార్‌ని పరిచయం చేసిన సినిమా ఇది. ఆ స్టార్‌ ఎలాంటి స్టార్‌ అంటే గత 20 ఏళ్లుగా ఆ స్టార్‌ క్రేజ్‌లో యువత మునిగి తేలుతోంది. 20 ఏళ్లు అంటే చిన్న విషయం కాదు. అదీ ఆ స్టార్‌ క్రేజ్‌. ఆ క్రేజ్‌కి అభిమానులు ముద్దుగా పెట్టుకున్న పేరు 'పవనిజం'. అంతలా 'తొలిప్రేమ'లో ఏముంది అంటే.. 'తొలిప్రేమ'లో 'బాలు' ఉన్నాడు. బాలు అంటే మన పక్కింటి అబ్బాయి. ఓ సగటు ప్రేమికుడు. నేల విడిచి సాము చేసిన వాడు కాదు బాలు అంటే. అంతేకాదు ఈ సినిమాలో ప్రతీ మాటా, పాటా అంతా ఓ అద్భుతం. అలాంటి సినిమా 'తొలిప్రేమ'. అదొక మ్యాజిక్‌ అంతే. ఇప్పుడు ఆ టైటిల్‌ మళ్లీ రాబోతోంది. వరుణ్‌ తేజ్‌ హీరోగా. యంగ్‌ అండ్‌ డైనమిక్‌ డైరెక్టర్‌ వెంకీ అట్లూరి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

నిజానికి అప్పట్లో 'తొలిప్రేమ' సినిమా డైరెక్టర్‌ కరుణాకరన్‌కి తొలి సినిమా. కానీ ఎంతో బాగా డీల్‌ చేశాడు. అలాగే వెంకీ అట్లూరి పైనా నమ్మకం ఉంది. సినిమాపై అంచనాలున్నాయి. ఫస్ట్‌లుక్‌తోనే ఆ అంచనాల్ని అందుకున్నాడు వెంకీ అట్లూరి. అప్పుడు 'తొలిప్రేమ' పవన్‌కళ్యాణ్‌కి నాలుగో సినిమా. ఇప్పుడు వరుణ్‌కిది ఏడవ సినిమా. లుక్స్‌లో అయితే బాబాయ్‌ని మ్యాచ్‌ చేసేస్తున్నాడు. స్టైల్‌ కూడా దాదాపు ఓకే. నటుడిగా ఇప్పటికే తానేంటో ప్రూవ్‌ చేసుకున్నాడు వరుణ్‌. అయితే మాస్‌ని ఎట్రాక్ట్‌ చేయాల్సి ఉంది. లవ్‌ స్టోరీ 'ఫిదా'తో తన స్టైల్‌ చూపించేశాడు. రికార్డులు బద్దలుకొట్టేశాడు. బ్యాక్‌ టు బ్యాక్‌ లవ్‌ స్టోరీతో వస్తున్నాడు. అదీ 'తొలిప్రేమ' టైటిల్‌తో. ఈ సినిమాతో వరుణ్‌ మాస్‌ ఆడియన్స్‌ని కూడా ఎట్రాక్ట్‌ చేస్తాడేమో చూడాలిక. ముద్దుగుమ్మ రాశీఖన్నా ఈ సినిమాలో వరుణ్‌తో జత కట్టింది.

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi chooddam