Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
rangasthalam first look released

ఈ సంచికలో >> సినిమా >>

హీరోగా, నిర్మాతగా నాని డబుల్‌ ధమాకా

nani double dhamakha

నాని హీరోగా 'ఎంసీఏ' చిత్రం విడుదలకు సిద్థంగా ఉన్న సంగతి తెలిసిందే. వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో దిల్‌ రాజు నిర్మాతగా ఈ సినిమా రూపొందుతోంది. 'ఫిదా' బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది. సీనియర్‌ నటి భూమిక కీలక పాత్ర పోషిస్తోంది. కాగా ఇది హీరోగా నాని సినిమా ముచ్చట్లు. అయితే నాని నిర్మాతగా మారి ఓ సినిమాని రూపొందిస్తున్నాడు. ఇదో కొత్త రకం కాన్సెప్ట్‌ మూవీ. ప్రశాంత్‌ అనే ఓ యంగ్‌ డైరెక్టర్‌ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా స్టోరీ వినగానే ఇంత గొప్ప సినిమాకి నిర్మాత తానే ఎందుకు కాకూడదని నాని నిర్మాతగా అవతారమెత్తాడు. అయితే ఈ సినిమా నిజంగానే ఓ గొప్ప సినిమా అనిపిస్తోంది. ఎందుకంటే ఈ సినిమా నుండి ఒక్కో పోస్టర్‌ విడుదలవుతుంటే తెలుస్తోంది. ఇది మామూలు కమర్షియల్‌ సినిమా కాదనీ, అంతకుమించి ఈ సినిమాలో ఏదో ఉందనీ అనిపిస్తోంది. ఈ సినిమా టైటిల్‌ వింటేనే మీరు ఆశ్చర్యపోతారు. 'అ' అనేది ఈ సినిమా టైటిల్‌. కొత్తగా ఉంది కదా. టైటిల్‌ లోగోతో కూడిన పోస్టర్‌ కూడా చాలా కొత్తగా ఇన్నోవేటివ్‌గా ఉంది.

టైటిల్‌తోనే ఎన్నో విషయాలను డైరెక్టర్‌ చెబుతున్నట్లుగా అనిపిస్తోంది. ఈ టైటిల్‌ పోస్టర్‌లో ఓ పక్క ఊడిపోయిన గులాబీ కొమ్మ, పడిపోయిన గులాబీ రేకులు, అక్కడే ఆర్గాన్‌ డొనేషన్‌కి సంబంధించిన ఓ పేపర్‌, పేపర్‌తో చుట్టేసిన గన్‌, షుగర్‌(స్వీటు), భగవద్గీత, కాఫీ.. ఇలా చాలా ప్రోపర్టీస్‌ ఈ పోస్టర్‌లో ఉన్నాయి. కాగా ఈ సినిమాలో నటిస్తున్న నటీనటుల లిస్ట్‌ కూడా చాలా పెద్దదే. ఇప్పటి వరకూ కొంత మంది ఫోటోలు రిలీజయ్యాయి. వాటిలో ప్రతీ క్యారెక్టర్‌ పోస్టర్‌తోనూ డైరెక్టర్‌ ఏదో చెప్పాలనుకుంటున్నాడు. రెజీనా, అవసరాల శ్రీనివాస్‌, నిత్యామీనన్‌, ఇషా రెబ్బ ఇలా తదితరులు నటిస్తున్నారు ఈ సినిమాలో. వీరిలో ఒక్కొక్కరి ఫోటోలనూ ఒక్కో రకం క్రియేటివిటీతో డిజైన్‌ చేశారు. ప్రతీ పోస్టర్‌తోనూ ఏదో చెప్పాలనుకుంటున్నాడు. ఇలా ఈ సినిమా పోస్టర్స్‌ గురించే చెప్పుకోవడానికి ఇంతగా ఉంటే, ఇక సినిమా కాన్సెప్ట్‌, నేపథ్యం ఇవన్నీ ఇంకెంత ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతున్నాయో చూడాలి మరి. 

మరిన్ని సినిమా కబుర్లు
anirudh created sensation as ajnatavasi