Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
cine churaka

ఈ సంచికలో >> సినిమా >>

అంత గొప్పది అక్కినేని - మెగా అనుబంధం

great relation akkineni and mega family

ఒక హీరోకి సంబంధించిన సినీ ఈవెంట్స్‌కి మరో హీరో అతిధిగా రావడం ఇప్పుడు సర్వసాధారణమైంది. అయితే తాజాగా జరిగిన 'హలో' ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ అత్యంత ప్రత్యేకమైనదిగా చెప్పుకోవాలి. మెగాస్టార్‌ చిరంజీవి, అక్కినేని నాగార్జున మంచి స్నేహితులు, బిజినెస్‌ పాట్నర్స్‌ అన్న సంగతి తెలిసిందే. అయితే వీరి మధ్య స్నేహం ఇంత గొప్పది అని ఈ ఈవెంట్‌లో చిరంజీవి మాట్లాడిన మాటల ద్వారా అర్ధమవుతుంది. అఖిల్‌ చిరంజీవిని 'మా పెదనాన్న' అనీ, చరణ్‌నీ 'మా పెద్దన్నయ్యా' అని సంబోధించడంలోనే ఈ ఫ్యామిలీ మధ్య ఎంత అనుబంధం దాగుందో తెలుస్తోంది. అలాగే చిరంజీవి నాకు రెండో కొడుకు లేని లోటు అఖిల్‌ తీర్చేశాడు అని చెప్పడం ఇటు అక్కినేని అభిమానుల్ని,

అటు మెగా అభిమానుల్ని కొత్త అనుభూతికి లోనయ్యేలా చేసింది. స్టేజ్‌పై అఖిల్‌ - చరణ్‌ మధ్య కెమిస్ట్రీ చూసి ఎంతో ముచ్చటేసింది. గతంలోనూ అఖిల్‌, చరణ్‌ ఎంతో స్నేహంగా ఉండడం మనకు తెలుసు. అది కేవలం స్నేహం మాత్రమే కాదు, అంతకు మించిన అభిమానం ఈ రెండు ఫ్యామిలీస్‌ మధ్య ఉందనీ తెలుస్తోంది. సినీపరిశ్రమలో మెగా కుటుంబం, అక్కినేని కుటుంబం, నందమూరి కుటుంబాలు అగ్ర కుటుంబాలుగా వెలుగొందుతున్నాయి. వీళ్లలో ఒక ఫ్యామిలీకి చెందిన హీరోల ఫంక్షన్స్‌లో మరో ఫ్యామిలీ హీరోలు సందడి చేస్తున్నారు. ఈ సందడి అభిమానుల్లో పండగ వాతావరణం నెలకొనేలా చేస్తోంది. అలాగే చరణ్‌ - ఎన్టీఆర్‌ కూడా మంచి స్నేహితులు. గతంలో ఎన్టీఆర్‌ సినిమాకి చరణ్‌ క్లాప్‌ కొట్టారు. ఇటీవల చరణ్‌ ఇంట్లో ఎన్టీఆర్‌ ఫ్యామిలీ కలిసి క్రిస్‌మస్‌ వేడుకలు జరుపుకున్నాఉ. ఇలా ఈ స్నేహ బంధం తెలుగు సినిమా స్థాయి మరింత పెరిగేందుకు మేలు చేస్తోంది. అలాగే ఈ మధ్య ఎన్టీఆర్‌ సినిమా ఓపెనింగ్‌కి పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ ఛీఫ్‌ గెస్ట్‌గా విచ్చేశారు. ఇలా మెగా - నందమూరి ఫ్యామిలీ, మెగా - అక్కినేని ఫ్యామిలీస్‌ కలిసి మెలిసి స్నేహానికి మించిన అనుబంధంతో మెలగుతున్నారు. 

మరిన్ని సినిమా కబుర్లు
Sankranthi movie wager