Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
Sankranthi movie wager

ఈ సంచికలో >> సినిమా >>

సినీ వారసత్వం 'పుత్రికోత్సాహం'

happiness  with daughters

'ఆత్మబంధం', మగాడు', మామాశ్రీ' తదితర సినిమాల్లో నటించి, అప్పట్లో పాపులర్‌ హీరోయిన్‌ అనిపించుకుంది లిజీ. తెలుగుతో పాటు మలయాళ, హిందీ సినిమాలతోనూ పాపులర్‌ అయ్యింది అప్పట్లో. ఇప్పుడు ఆమె కుమారై కళ్యాణీ ప్రియదర్శిని 'హలో' సినిమాతో హీరోయిన్‌గా తెరంగేట్రం చేస్తోంది. ఈ సినిమా ఈవెంట్‌లో లిజీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అన్ని రంగాల్లోనూ అమ్మాయిల్ని ప్రోత్సాహించాలనీ లిజీ చెప్పింది. సినీ రంగంలో మహిళల పట్ల చిన్న చూపు అనే భావన చాలా మందిలో ఉంటుంది. కానీ నేను నా కూతురికి ధైర్యాన్ని నూరి పోశాను. హీరోయిన్‌ అయ్యేందుకు ఆమెకి కావల్సిన సపోర్ట్‌ని అందించాడు. నటన పట్ల ఆమెకున్న ఆశక్తిని గమనించి ఆమెను హీరోయిన్‌గా ప్రమోట్‌ చేసేందుకు ముందుకొచ్చాననీ ఈ సందర్భంగా లిజీ చెప్పుకొచ్చింది.

అవును ఆమె మాటలు నూటికి నూరు పాళ్లూ నిజం. చాలా అరుదుగా మాత్రమే సినీ కుటుంబాల నుండి అమ్మాయిలు హీరోయిన్లుగా వస్తుంటారు. కమల్‌ కూతురు శృతిహాసన్‌ అలా వచ్చే, అగ్ర హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతోంది. ఈ మధ్య చాలా మంది హీరోయిన్లు అలాగే వస్తున్నారు. మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన మొట్ట మొదటి హీరోయిన్‌గా నిహారిక పేరు చెప్పుకోవచ్చు. అలాగే సీనియర్‌ నటి రాధ తన ఇద్దరు కూతుళ్లను సినీరంగానికి హీరోయిన్స్‌గా పరిచయం చేసింది. పెద్ద కూతురు కార్తీక 'జోష్‌'తో తెరంగేట్రం చేసింది కానీ నిలదొక్కుకోలేకపోయింది. తమిళంలో 'రంగం' సినిమాతో మంచి విజయం అందుకుంది. అలాగే రెండో కూతురు తులసి 'కడలి' సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది. తాజాగా నేచురల్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంటున్న ముద్దుగుమ్మ కీర్తి సురేష్‌ కూడా అలనాటి హీరోయిన్‌ కుమారై కావడం విశేషం. 'పున్నమినాగు' తదితర చిత్రాల్లో నటించిన మేనక కూతరే కీర్తి సురేష్‌. ఇక 'అతిలోక సుందరి' శ్రీదేవి కూతరు జాన్వీ కపూర్‌ సినీ తెరంగేట్రం కూడా షురే అయ్యింది. హిందీలో 'ధడక్‌' చిత్రంతో జాన్వీ ఎంట్రీ ఇస్తోంది. ఇలా ఈ మధ్య చాలా మంది హీరోయిన్లు సినీ ఫ్యామిలీ నుండి వచ్చి హీరోయిన్లుగా ఓ వెలుగు వెలుగుతున్నారు.

మరిన్ని సినిమా కబుర్లు
kadapa web series by varma