Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
balayya in NTR roal

ఈ సంచికలో >> సినిమా >>

సమ్మర్‌ రేస్‌లోకి దూసుకొస్తోన్న నాని

nani in summer race

ఇటీవలే 'ఎంసీఏ' చిత్రంతో బాక్సాఫీస్‌కి వసూళ్ల వర్షం కురిపిస్తున్న నాని, నెక్స్ట్‌ సినిమాతో సమ్మర్‌ రేస్‌లోకి దూసుకొస్తున్నాడు. నాని హీరోగా 'కృష్ణార్జున యుద్ధం' సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాని ఏప్రిల్‌లో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ఈ రేస్‌లో మహేష్‌బాబు హీరోగా తెరకెక్కుతోన్న 'భరత్‌ అనే నేను' సినిమాతో పాటు, అల్లు అర్జున్‌ హీరోగా వస్తోన్న 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమాలున్నాయి. ఇవి రెండూ భారీ బడ్జెట్‌ సినిమాలే. ఈ రెండు సినిమాలతో నాని పోటీ పడుతున్నాడంటే రిస్క్‌ చేస్తున్నాడనే అనుకోవాలి. అలా అని నానిని తక్కువ అంచనా వేయడానికి లేదు. నాని లెక్కలు నానికుంటాయి.

ఆ లెక్కల్లో నాని ఎప్పుడూ తప్పు కాలేదు. సరే ఇదిలా ఉంటే, మరో సెన్సేషనల్‌ మూవీ 'రోబో 2.0' కూడా ఈ టైంలోనే రిలీజ్‌ కావడం నానికి మరో రిస్కీ అంశం అని చెప్పొచ్చు. ఇప్పటికే 'రోబో 2.0' సినిమా విడుదలపై మహేష్‌, అల్లు అర్జున్‌ సినిమాల నిర్మాతలు ఆందోళనలో ఉన్న మాట వాస్తవమే. ఇలాంటి తరుణంలో నాని ఎంత కాన్ఫిడెన్స్‌ లేకపోతే ఈ రేసులో ఆడుగుపెడతాడనుకోవాలి. 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌' సినిమాతో విజయం అందుకున్న మేర్లపాక గాంధీ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. కథ ఎలా ఉన్నా, ఆ కథనే డామినేట్‌ చేయగల యాక్టింగ్‌ టాలెంట్‌ నానిది. టాలెంటెడ్‌ యాక్ట్రస్‌ అనుపమా పరమేశ్వరన్‌ ఈ సినిమాలో నానితో జత కడుతోంది. షైన్‌ స్క్రీన్స్‌ బ్యానర్‌లో ఈ చిత్రం రూపొందుతోంది. హిప్‌ హాప్‌ తమీజ సంగీతం అందిస్తున్నారు. చూడాలి నాని ఈ సమ్మర్‌ రేస్‌లో స్టార్‌ హీరోలతో చేయబోయే హాట్‌ హాట్‌ వసూళ్ల యుద్ధం ఎలా ఉండబోతోందో! 

మరిన్ని సినిమా కబుర్లు
sunny in south