Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
malaysia tourism

ఈ సంచికలో >> శీర్షికలు >>

5-1-2018 నుండి11-1-2018 వారఫలాలు - - డా. టి. శ్రీకాంత్

మేష రాశి : ఈ వారం మొత్తంమీద చక్కటి ఫలితాలను పొందుటకు అవకాశం ఉంది కావున కాస్త శ్రద్ధను కలిగి ఉండి సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం వలన సత్ఫలితాలు పొందుతారు. ధనమునకు సంభందించిన విషయాలలో సంతృప్తికరమైన ఫలితాలు పొందుతారు. కుటుంబసభ్యులతో కలిసి సరదాగా సమయాన్ని గడుపుతారు వారితో కలిసి విహారయాత్రలకు వెళ్ళే అవకాశం కలదు. వారితో కలిసి నూతన నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. మిత్రులతో కలిసి చేయు ప్రయత్నాలు అనుకున్న ఫలితాలను ఇస్తాయి. విలువైన వస్తువులను కోల్పోయే అవకాశం ఉంది కావున జాగ్రత్తలు తీసుకోండి.

 

 వృషభ రాశి : ఈవారం మొత్తంమీద ఉద్యోగంలో నూతన ఆలోచనలు కలిగిఉండే అవకాశం కలదు. అధికారుల నుండి ప్రశంశలు పొందుతారు వారికి నచ్చిన విధంగా మీయొక్క ఆలోచనలు ఉండే అవకాశం ఉంది. వారితో కలిసి నూతన ప్రయత్నాలు మొదలుపెడతారు. తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం కలదు. ఆర్థికపరమైన విషయాల్లో ధనం అవసరానికి సర్దుబాటు అవుతుంది. పనిలో శ్రమను పొందుతారు నిదానంగా వాటిని వాటిని నలుగురి సహాయంతో పూర్తిచేసే ప్రయత్నం చేయుట మంచిది. బంధువుల నుండి ఆశించిన సహకారం లభిస్తుంది. మిత్రులను కలిసే అవకాశం ఉంది.
 


మిథున రాశి : ఈవారం మొత్తంమీద సమయాన్ని ప్రయాణాలకు కేటయించే అవకాశం కలదు. చాలారోజుల నుండి విదేశీప్రయత్నాలు వాయిదాపడుతున్న వారికి ఆశించిన వార్తలను వినే అవకాశం ఉంది. సంతానపరమైన విషయాల్లో కాస్త ఒత్తిడిని పొందుటకు అవకాశం ఉంది,అనుభవజ్ఞుల సూచనలు పరిగణలోకి తీసుకోండి అలాగే నిర్ణయాలు తీసుకొనే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి ముందుకు వెళ్ళుట వలన మేలుజరుగుతుంది. వ్యాపారసంభందమైన విషయాల్లో మిత్రులతో కలిసి నూతన నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. స్వల్ప అనారోగ్యసమస్యలు కలుగుటకు అవకాశం ఉంది జాగ్రత్త.

 

కర్కాటక రాశి : ఈవారం మొత్తంమీద  ఆర్థికపరమైన విషయాల్లో నిదానంగా వ్యవహరించుట సూచన,ధనమునకు సంభందించిన విషయాల్లో మాత్రం అనవసరమైన వాగ్దానాలు చేయకపోవడం ఉత్తమం. సోదరవర్గంతో చర్చలు చేయుటకు అవకాశం కలదు. స్వల్పఅనారోగ్యసమస్యలు కలుగుటకు అవకాశం ఉంది తగిన జాగ్రత్తలు తీసుకోవడం సూచన. ఉద్యోగంలో పెద్దలతో చర్చలు జరుగుటకు అవకాశం ఉంది వారికి అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన పనులను మధ్యలో వదిలేసే అవకాశం కలదు కావున ప్రణాళిక బద్దంగా ముందుకు వెళ్ళుట సూచన. నూతన ప్రయత్నాలను వాయిదా వేయుట ఉత్తమం.

 

 సింహ రాశి : ఈవారం మొత్తంమీద మానసికపరమైన విషయాల్లో కొంత ఒత్తిడిని పొందుటకు అవకాశం కలదు కావున దైవసంభందమైన విషయాలకు సమయం ఇవ్వడం సూచన. తలపెట్టిన పనులను కాస్త ఆలస్యంగా పూర్తిచేసే అవకాశం ఉంది కావున ప్రణాళికా బద్దంగా ముందుకు వెళ్ళుట సూచన. కుటుంబపరమైన విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం అలాగే మీయొక్క అసంభందమైన విధానాల మూలాన కొత్త కొత్త మనస్పర్థలు కలుగుటకు అవకాశం కలదు జాగ్రత్త. మీయొక్క మాటతేరు మిమ్మల్ని ఇబ్బందిపాలుచేసే అవకాశం ఉంది జాగ్రత్త. వ్యాపారపరమైన విషయాల్లో నూతన ప్రయత్నాలు చేయకండి.

 

కన్యా రాశి : ఈవారం మొత్తంమీద ఇష్టమైన వ్యక్తులతో సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం కలదు. నచ్చిన పనులను ఆరంభించే అవకాశం కలదు వాటికి సమయం ఇస్తారు. ఉద్యోగంలో ఊహించిన విధంగా గుర్తింపు లభిస్తుంది, కాకపోతే అధికారుల మూలాన పనిఒత్తిడి పెరుగుతుంది ప్రణాళికబద్దంగా ముందుకు వెళ్ళుట వలన  మేలుజరుగుతుంది . చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో వచ్చే మార్పులు మీకు సంతృప్తిని కలుగజేస్తుంది. నిరుద్యోగులకు నూతన అవకశాలు లభించే అవకాశం కలదు. అనుకోని ఖర్చులు కలుగుతాయి.  
 

 

తులా రాశి : ఈవారం మొత్తంమీద చిననాటి మిత్రులను కలుస్తారు వారితో సమయాన్ని గడుపుటకు అవకాశం ఉంది. విందులలో పాల్గొనే అవకాశం ఉంది భోజనం విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధను కనభరుస్తారు. కుటుంబంలో ఆశించిన మార్పులకు అవకాశం ఉంది,సంతోషకరమైన వార్తలను వినే అవకాశం కలదు. దూరప్రదేశం నుండి ఒకవార్తను వింటారు ఆవార్త మూలాన మీలో అనుకోని మార్పులకు అవకాశం ఇస్తుంది. దూరప్రదేశ ప్రయాణాలు కలిసి వస్తాయి. జీవిత భాగస్వామి నిర్ణయాలకు ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది. వ్యాపారపరమైన విషయాలో చిన్న చిన్న మార్పులు జరుగుతాయి.

 

 

వృశ్చిక రాశి : ఈవారం మొత్తంమీద చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు,నూతన ప్రయత్నాలు మొదలు పెట్టుటకు అవకాశం ఉంది. ఉద్యోగంలో సంతృప్తికరమైన ఫలితాలు పొందుటకు అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయంలో సమయానికి ధనం చేతికి అందుతుంది. గతంలో చేపట్టిన పనులను ముందుగా పూర్తిచేయుట వలన మేలుజరుగుతుంది. అనవసరమైన చర్చలకు సమయం ఇవ్వకండి సర్దుబాటు విధానం మేలుచేస్తుంది. పెద్దలతో స్వల్పవిభేదాలు కలుగుటకు అవకాశం ఉంది కావున జాగ్రత్త. ప్రయాణాలు వాయిదా పడే అవకాశం కలదు. కుటుంబసభ్యులు  మీ ఆలోచనలను వ్యతిరేకించే అవకాశం ఉంది.

 

ధనస్సు రాశి : ఈవారం మొత్తం మీద అధికారులతో చర్చలు చేయుటకు అలాగే పెద్దలతో కలిసి నూతన పనులను మొదలు పెట్టుటకు అవకాశం ఉంది. దస్త్రాల విషయంలో మాత్రం కాస్త జాగ్రత్త అవసరం. చిన్న చిన్న విషయాలకే హైరానా పడే అవకాశం ఉంది , కాస్త స్థిమితంగా ఉండే ప్రయత్నం మేలు. వ్యాపారపరమైన విషయాల్లో నూతన పెట్టుబడుల కోసం చేసిన ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. మీరు చేసిన ఆలోచనలను అలాగే నిర్ణయాలను ఎదుటివారికి తెలియజేయడంలో కాస్త ఇబ్బంది ఎదుర్కొంటారు. నూతన ఉద్యోగప్రయత్నాలు కలిసి వస్తాయి.

 

మకర రాశి :  ఈ వారం మొత్తంమీద సంతానపరమైన విషయాల్లో కాస్త అసంతృప్తిని కలిగి ఉంటారు. కుటుంబసభ్యులతో కలిసి తీసుకొనే నిర్ణయాలు నూతన మార్పులకు అవకాశం ఇస్తాయి. ఉద్యోగంలో చిన్న చిన్న సర్దుబాటులు చేసుకొనే ప్రయత్నం చేయుట వలన మేలుజరుగుతుంది. అధికారులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోండి వారి సూచనలు పాటించుట వలన మేలుజరుగుతుంది. సోదరసంభందమైన విషయాల్లో చర్చలు చేయుటకు అవకాశం కలదు వారి నుండి కొత్త కొత్త వార్తలను వినే అవకాశం ఉంది. ప్రయాణాలు చేయుటకు అవకాశం కలదు అలాగే సామాజిక సేవాకార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది.

 

కుంభ రాశి : ఈవారం మొత్తంమీద సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు వాటికి సమయం ఇస్తారు. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేయుటకు అవకాశం కలదు. ఆర్థికపరమైన విషయాల్లో నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి గతంలో మీకు రావాల్సిన ధనం వస్తుంది. మీ మిత్రులతో ఉన్న అనుభందం గట్టిపడుతుంది. ఉద్యోగంలో అధికారులతో ఏర్పడు చిన్న చిన్న విభేదాలను తగ్గించుకొనే ప్రయత్నం చేయుట వలన మేలుజరుగుతుంది. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో మాత్రం ఒత్తిడి తప్పక పోవచ్చును నిదానంగా వాటిని తగ్గించుకొనే ప్రయత్నం చేయుట మేలు.

 

 

మీన రాశి : ఈవారం మొత్తంమీద ఆర్థికపరమైన విషయాల్లో ఖర్చులను అదుపులో ఉంచుకొనే ప్రయత్నంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కలదు. ఉద్యోగంలో మిశ్రమఫలితాలు పొందుతారు,నలుగురిని కలుపుకొని వెళ్ళుట సూచన. నచ్చిన వ్యక్తుల నుండి నూతన సమాచరం సేకరిస్తారు వారితో కలిసి నూతన ప్రయత్నాలు మొదలు పెట్టుటకు అవకాశం ఉంది. కుటుంబసభ్యులతో చర్చలకు అవకాశం ఉంది కాకపోతే వాటిని సాగదీసే ప్రయత్నం చేయకండి. ప్రయాణాలు చేసే విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం సూచన. పెద్దలతో విభేదాలు రాకుండా చూసుకొనే ప్రయత్నం చేయుట మంచిది.

మరిన్ని శీర్షికలు
- Onion Chetney