Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
anjatavasi movie review

ఈ సంచికలో >> సినిమా >>

లవర్స్‌ డే లవర్‌ బోయ్‌ 'లవ్‌ స్టోరీ'

lovers day lover boy

ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు. ఇదే రోజున లవర్‌ బోయ్‌ తరుణ్‌ హీరోగా తెరకెక్కుతోన్న 'ఇది నా లవ్‌స్టోరీ' సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఛైల్డ్‌ ఆర్టిస్టుగా తెలుగువారి హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న తరుణ్‌, 'నువ్వే కావాలి' సినిమాతో హీరో అయ్యాడు. హీరోగా తొలి సినిమాతోనే సంచలన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు తరుణ్‌. లవర్‌ బోయ్‌ ఇమేజ్‌తో 'నువ్వే నువ్వే', 'నువ్వు నాకు నచ్చావ్‌', 'ఎలా చెప్పను', 'శశిరేఖా పరిణయం' తదితర రొమాంటిక్‌ చిత్రాలతో హీరోగా తనదైన ముద్ర వేసుకున్నాడు. తరుణ్‌ అంటే పక్కింటి అబ్బాయే. అయితే గత కొంతకాలంగా తరుణ్‌ కెరీర్‌ స్లో అయిపోయింది. సరైన హిట్స్‌ రాక, సినిమాలకు కొంత దూరంగా ఉంటున్నాడు. లాంగ్‌ గ్యాప్‌ తర్వాత తరుణ్‌ హీరోగా వస్తోన్న చిత్రం 'ఇది నా లవ్‌ స్టోరీ'. తనకు బాగా అచ్చొచ్చిన లవ్‌స్టోరీతోనే రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు తరుణ్‌.

అసలే లవర్‌ బోయ్‌. అందులోనూ లవ్‌ మంతాయె. ఈ లవ్‌మంత్‌లో లవర్స్‌డే రోజు వస్తున్న 'ఇది నా లవ్‌ స్టోరీ' సినిమాతో తరుణ్‌ మళ్లీ బౌన్స్‌ బ్యాక్‌ అవుతాడేమో చూడాలి మరి. రమేష్‌ గోపి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ముద్దుగుమ్మ ఓవియా ఈ సినిమాలో తరుణ్‌తో జత కడుతోంది. ఎస్వీ ప్రకాష్‌ నిర్మాణంలో ఈ సినిమా రూపొందుతోంది. ఇక సినిమా విషయానికి వస్తే, రెండు డిఫరెంట్‌ గెటప్స్‌లో తరుణ్‌ కనిపిస్తున్నాడు. గెడ్డంతో మాస్‌ టచ్‌లోనూ, క్లీన్‌ షేవ్‌తో క్లాస్‌ లుక్‌తోనూ కనిపిస్తున్నాడు. డిఫరెంట్‌ లవ్‌స్టోరీగా తెరకెక్కుతోన్న 'ఇది నా లవ్‌ స్టోరీ' తరుణ్‌కి మంచి సక్సెస్‌నివ్వాలనీ, హీరోగా ఈ సినిమాతో తరుణ్‌ మళ్లీ తన ఉనికిని చాటుకోవాలనీ, ఆశిద్దాం. 

మరిన్ని సినిమా కబుర్లు
cine churaka