Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
Yummy Yummy Glamorous yaami

ఈ సంచికలో >> సినిమా >>

అనుష్క 'భాగమతి' సంచలనాలకు అడ్డా

anushka bhagamati sensation

'ఇది భాగమతి' అడ్డా'.. ఎవరు పడితే వారు రావడానికి, పోవడానికి కుదరదు.. అంటూ 'భాగమతి' ట్రైలర్‌లో అనుష్క చెబుతున్న డైలాగ్స్‌ సినిమాపై అంచనాల్ని ఆకాశానికెత్తేశాయి. 'అరుంధతి' సినిమా నుండీ ఛాలెంజింగ్‌ పాత్రలకు అనుష్క సై అంటోంది. 'బాహుబలి'తో యూనివర్సల్‌ గుర్తింపు పొందిన అనుష్క, తాజాగా 'భాగమతి'గా అలరించడానికి సిద్ధమవుతోంది. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫస్ట్‌లుక్‌, టీజర్‌తోనే ఆశక్తిని పెంచేసిన 'భాగమతి' ట్రైలర్‌కి వస్తున్న రెస్పాన్స్‌ అంతా ఇంతా కాదు. ఊహించని స్థాయిలో రికార్డులు నమోదు చేస్తోంది 'భాగమతి' ట్రైలర్‌. 'పిల్లజమీందార్‌' ఫేం అశోక్‌ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.

ఎన్నో విజయవంతమైన చిత్రాల్ని రూపొందించిన యూవీ క్రియేషన్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. తమన్‌ నేపథ్య సంగీతం ఈ సినిమాకి అదనపు ఆకర్షణ కానుంది. హారర్‌ జోనర్‌ తరహాలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం విశేషంగా ఆశక్తిని కలిగిస్తోంది ఆడియన్స్‌లో. ఇంతవరకూ ఈ జోనర్‌లో చాలా సినిమాలే వచ్చినప్పటికీ, సరికొత్త కథా, కథనాలతో 'భాగమతి' తెరకెక్కుతోంది. ఒక్క తెలుగులోనే కాకుండా, తమిళ, మలయాళ తదితర భాషల్లో ఈ సినిమాని విడుదల చేస్తున్నారు. రెండు డిఫరెంట్‌ గెటప్స్‌లో అనుష్క కనిపిస్తోంది.ఈ సినిమా కోసం స్వీటీ బ్యూటీ చాలా సన్నబడింది. అనుష్క క్యారెక్టర్‌ చాలా చాలా కొత్తగా ఉండబోతోంది. 'బాహుబలి' సినిమా తర్వాత అనుష్క చేస్తున్న సినిమా కావడంతో, ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్‌ సంచలనాకు వేదికైంది. ఇక త్వరలోనే 'భాగమతి' ప్రేక్షకుల ముందుకు రానుంది. 

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi chooddam