Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
nenu naa jnapakaalu book review

ఈ సంచికలో >> శీర్షికలు >>

నవ్వుల జల్లు - జయదేవ్

దానయ్య : అంత సంపాదించి, చివరికి ఏమీ మిగల్చకుండా వెళ్ళిపోయాడే, బంగారు శెట్టి?
శీనయ్య : వెళ్ళేప్పుడు ఏమీ తీసుకెళ్ళడానికి కుదర్దుగా? అందుకని పోయేముందు అంతా దర్జాగా ఖర్చుపెట్టేశాడు!!!
 

సుబ్బిశెట్టి : కవి శేఖరా, మీరు కవిత పాడితే, నల్లేరు మీద బండి నడకే నటగా?
కవిశేఖరుడు: ఔను! సందేహమేల?
సుబ్బిశెట్టి : మన బండి ముందుకు సాగడంలేదు. మీ కవితా గానం మొదలెట్టండి, బండి నడుస్తుందేమో చూద్దాం!!
కవిశేఖరుడు : నీతో బండి కట్టించుకుని పెద్ద తప్పు చేశాను!!!

యువరాజు : ప్రియా, నీ అధర రసము పుల్లగా నున్నదే?
యువరాణి : చింతకాయలు తిన్నాను! నేను నెల తప్పాను, నాధా! (సిగ్గుతో)!

ఆస్తికయ్య : 108 ప్రదక్షిణాలు చేస్తావు! ఏం ప్రయోజనం?
నాస్తికయ్య : అలా చెయడం వల్ల ఆరోగ్యానికి మంచిది!
ఆస్తికయ్య : ఆ గుడిచుట్టూ గాక, ఆ మైదానంలో తిరిగినా, అదే ప్రయోజనం కదా?
నాస్తికయ్య : గుడిలో ప్రసాదం దొరుకుతుంది!!

మాదా కదళం: ఈ రోజు మీ ఇంట్లో గుత్తి వంకాయ కూర! నువ్వే వండావు!! ఔనా??
మరదలు : నీ కెట్లా తెలుసు?
మాదా కదళం: అల్లుడుగారు వొచ్చారుగా?
మరదలు : అదెట్లా తెలుసు?
మదా కదళం : పొద్దున్న బజార్లో వంకాయలు కొంటున్న అమ్మగార్ని చూశాలేమ్మా!!

ఎలుక రాజు : 'భక్తి' గురించి తెలుసుకోవాలనుంది. ఎవర్నడగాలి?
ఎలుక మంత్రి : ఉడత నడిగితే తెలుస్తుంది మహారాజా!!


ఒక భటుడు : మంత్రులందరూ పగలూ రేయనక నిద్రపోతున్నారే?
ఇంకో భటుడు : యువరాజుల వారికి స్వప్నంలో ఒక సుందరి కనిపించిందట! ఆ స్వప్న సుందర్ని కనిపెట్టి తీసుకురావలసిందిగా   మహారాజాజ్ఞ!! మంత్రులు ఆపని మీదున్నారు!!


పుల్లయ్య : వర్షంలో తడిసి, గంగా స్నానం చేసొచ్చానని బొంకు తున్నావే?
ఎల్లయ్య : వర్షంలో తడిసింది నిజమే ! ఐతే ఆ వర్షాన్ని కురిసిన మేఘాలు, కాశీ నుంచి వచ్చాయి!
పుల్లయ్య : కాశీ మేఘాలైతే మాత్రం, అవి కురిస్తే వర్షం, గంగా జలం, ఎలా ఔతుంది?
ఎల్లయ్య : గంగా జలం ఆవిరై పుట్టిన, మేఘాలు అవి!


రాక్షసుడు - 1,2 : నువ్వు చెప్పబోయేది దేవ రహస్యమా? ఐతే వెంటనే చెప్పు! ఊరంతా చాటింపు వేసి, మూల మూలలా, వాడ వాడలా, అందరికీ తెలియచెప్పేస్తాం!!


భేతాళుడు : నేనడిగే ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పి, నీ తల వెయ్యి ముక్కలు గాకుండా తప్పించుకుంటావ్... ఎలా విక్రమాదిత్యా?
విక్రమాదిత్యుడు : నేను "చందమామ" చదువుతాను!!

మరిన్ని శీర్షికలు
Kaakoolu by Sairam Akundi