Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
weekly horoscope (Sept 27 - Oct 03)

ఈ సంచికలో >> శీర్షికలు >>

బాడీ లాంగ్వేజ్ - బన్ను

body launguage

'ఇంటర్వ్యూ' ల్లో గానీ, 'కార్పోరేట్ మీటింగ్స్' ల్లో గానీ 'గ్రూప్ డిస్కషన్స్' లో గాని... చివరకు మనింటి కెవరన్నా వచ్చినప్పుడయినా సరే 'బాడీ లాంగ్వేజ్' చాలా అవసరం!

ఇంతకీ 'బాడీ లాంగ్వేజ్' అంటే ఏమిటి? మన మనోభావాలను మన బాడీ ద్వారా తెలియజేయటం! 'బాడీ లాంగ్వేజ్' ద్వారా ఇతరుల మనస్తత్వాలను కనిపెట్టొచ్చు. దానిలో మహిళలు సమర్ధులు అనటంలో అతిశయోక్తి లేదు.

జ్యోతిష్యం, హిప్నాటిజం చేశేవారు మన 'బాడీ లాంగ్వేజ్' నుంచే 70 - 80% మన గురించి 'కోల్డ్ రీడింగ్' తో తెలుసుకుంటారట!

గడ్డం క్రింద చెయ్యి పెట్టుకుని వింటుంటే... ఆశక్తిగా వింటున్నట్టు లెక్క! ఆ చెయ్యి నెమ్మదిగా మీ చెంపమీదకు వెళ్తే మీరు 'బోర్' ఫీలవుతున్నారన్నమాట!

అందరి ముందూ కాలుమీద కాలు వేసుకుంటే అది రెక్లెస్ నెస్ కి సూచన! ఎవరూ లేనప్పుడు 'రిలాక్స్' అవుతున్నట్లు!!

కరచాలనం గట్టిగా ఇస్తే మీటింగ్ / గ్రీటింగ్ స్ట్రాంగ్ గా ముగిసినట్టు... అంటే 'సాటిస్ ఫైడ్' అన్నమాట!

మనం బిజినెస్ కార్డ్ ఇచ్చేటప్పుడు కూర్చుని ఒకచేత్తో ఇస్తుంటాం. అది చాలా తప్పు పద్ధతి. మనం లేచినుంచుని రెండు చేతులతో వంగుని ఇవ్వాలి. అలాగే అవతలి వారి కార్డు కూడా రెండు చేతులతోనూ అందుకోవాలి!

మన జీవితంలో 'బాడీ లాంగ్వేజ్' చాలా అవసరం. సబ్జక్టుండీ 'బాడీ లాంగ్వేజ్' వలన ఇంటర్వ్యూల్లో ఉద్యోగాలు రానివారెందరో వున్నారు.

మరిన్ని శీర్షికలు
Why do we do Kalasa Pooja?