Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Pawanism is ahead of Piracy

ఈ సంచికలో >> సినిమా >>

అక్కినేని గురుకులంలో అరుదైన వినోదం

fun in akkineni school

తెలుగు సినిమా పరిశ్రమకు లివింగ్ లెజెండ్ అంటే అక్కినేని నాగేశ్వరరావుగారే. వయసు మీద పడ్తున్నా, మనసు ఇంకా కుర్రతనంతోనే నిండి వుందంటారు ఆయన. సినీ పరిశ్రమలో ఆయన సాధించిన గొప్పతనమే కాక, ఆయన ఆరోగ్య రహస్యాలూ భావితరానికి ఎంతో అవసరం. అలా ఆయన మీద అభిమానం పెంచుకున్నవారిలో దీక్షితులు ఒకరు.

అక్కినేని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మీడియా యాక్టింగ్ పేరుతో దీక్షితులు ఓ ఇన్స్టిట్యూట్ ని నడుపుతున్నారు. ఈ సంస్థ ఆధ్వర్యంలో అక్కినేని పుట్టినరోజు వేడుకలు జరిగాయి.

ఈ కార్యక్రమానికి ప్రముఖ ఎన్నారైలు మురళి వెన్నం, తోటకూర ప్రసాద్, రవి కొండబోలు, డాక్టర్ ఆళ్ళ, శ్రీమతి శారద ఆకునూరి, శ్రీ నూకరాజు హాజరయ్యారు. వారందరికీ అక్కినేనిగారి చేతుల మీదుగా సత్కారం జరిగింది.

'నాకు ఇవ్వడం అంటే ఇష్టం. తీసుకోవడమ్మీద పెద్దగా ఇష్టం వుండదు' అని అక్కినేని చెప్పగా, 'మాకు అక్కినేని చేతుల మీదుగా సత్కారాలు స్వీకరించడం ఇష్టం' అని చెప్పారు ఎన్నారైలు. ఈ కార్యక్రమంలో అక్కినేని నాటక రంగంలో వున్నప్పుడు కొందరు ప్రముఖ రంగ స్థల నటులను ఇమిటేట్ చేస్తూ నందం భాస్కరరావు అనే వ్యక్తి ఇచ్చిన ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది.

పాత తరం వాళ్ళను ఇమిటేట్ చేస్తుంటే, అది అక్కినేనిగారికి బాగా నచ్చింది. 'నేను చాలా సంతోషంగా వున్నాను. ఇది చాలా సంతోషించదగ్గ విషయం' అని చెప్పిన అక్కినేని, ప్రత్యేకంగా నందం భాస్కరరావుని సన్మానించారు.

మరిన్ని సినిమా కబుర్లు
blue films in internet era