Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
blue films in internet era

ఈ సంచికలో >> సినిమా >>

ఆ వీడియోల కోసం వెతుకులాట

search for those videos

తమిళనాడులో వందేళ్ళ భారతీయ సినిమా పండుగ జరిగింది. దక్షిణాది సినీ పరిశ్రమలు అనగా తమిళ, కన్నడ, మలయాళ, తెలుగు సినీ పరిశ్రమలు ఈ వేడుకల్ని ఘనంగా నిర్వహించాయి తమిళనాడు ప్రభుత్వంతో కలిసి. దక్షిణాది సినీ పరిశ్రమ అంటే అందులో పెద్దన్న తెలుగు సినిమా పరిశ్రమే. కానీ, తెలుగు సినిమాకి అక్కడ దక్కిన గౌరవం పెద్దగా ఏమీ లేదు.

అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, రామానాయుడు వంటి హేమాహేమీలను సత్కరించి తీరాల్సిందే కాబట్టి, ఆ సత్కారాన్ని గొప్పగా భావించలేం. సినిమా పండుగ జరుగుతున్న తీరుపై 'రెబల్' ఆర్. నారాయణమూర్తి ఆవేదన వ్యక్తం చేస్తూ, ఇది సినిమా పండుగా? అని ప్రశ్నించారు. అక్కడే వున్న తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖుడు సి. కళ్యాణ్ ఆయన్ని వారించారు, మైక్ లాక్కున్నారు.

అయితే ఇది కేవలం ఫొటోలకే పరిమితమైంది. అసలు ఆర్. నారాయణమూర్తి ఏమన్నారు? ఏం జరిగింది? అన్నదానికి సంబంధించిన వీడియో ఇప్పటిదాకా లభ్యం కాలేదు. ఫేస్ బుక్లోనూ, ట్విట్టర్లోనూ, యూట్యూబ్లోనూ వీటి గురించే అన్వేషిస్తున్నారు తెలుగు సినీ అభిమానులు. ఎందుకంటే, తెలుగు గడ్డకు, తెలుగు సినిమాకి అక్కడ జరిగిన అవమానమేంటో తెలియాలి కదా.

మరిన్ని సినిమా కబుర్లు
gehana in nude