Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
fun in akkineni school

ఈ సంచికలో >> సినిమా >>

ఇంటర్నెట్ కాలంలో అశ్లీల చిత్రాలా?

blue films in internet era

ఇంటర్నెట్ 'టచ్' వుంటే చాలు, అశ్లీలం మీ ముంగిట్లో వాలిపోతుంది. ఇంటర్నెట్ కోసం 'పీసీ అనబడే పర్సనల్ కంప్యూటర్' అవసరం లేదు, మొబైల్ ఫోన్లలోనూ అది అందుబాటులోకి వచ్చేసింది గనుక, పోర్న్ సినిమాలు విచ్చలవిడిగా దర్శనమిస్తున్నాయి. ఈ కాలంలోనూ సీ`గ్రేడ్ బూతు సినిమాలకు గిరాకీ వుంటోంది.

మారుమూల గ్రామాల్లో. . అంటే సీ గ్రేడ్ థియేటర్ల కోసమే అన్నట్టుగా కొన్ని సినిమాలు తెరకెక్కుతున్నాయి. మలయాళ సినీ పరిశ్రమలో సీ గ్రేడ్ సినిమాలు ఒకప్పుడు బాగా వచ్చేవి. తర్వాత్తర్వాత అవి అక్కడ తగ్గిపోయాయి. ఇప్పుడూ ఒకటీ అరా ఎక్కడో ఓ చోట బూతు సినిమాలు కన్పిస్తున్నాయి. వాటి కోవలోకే వస్తుంది 'సంతర్పం' అనే సినిమా.

బాలీవుడ్ లో వచ్చే సినిమాలూ బూతు చుట్టూనే నిర్మితమవుతున్నా, వాటి కోసం చాలా ఖర్చు చేస్తున్నారు. సినిమా నిర్మాణం కన్నా, పబ్లిసిటీకి ఖర్చు చేస్తే, అందులో బూతు కంటెంట్ పెడితే ఆ సినిమాలు బాగా ఆడేస్తాయి. కానీ, సౌత్ లో తెరకెక్కే బూతు సినిమాలు చాలా చీప్ గా వుంటాయి. వాటికి యూ ట్యూబ్ వంటి వాటిల్లో మంచి గిరాకీ వుంటుంది. అదే వారికి ప్రధాన ఆదాయ వనరు. థియేటర్లకు వెళ్ళి ఇలాంటి సినిమాలు చూసేవారు లేరని చెప్పలేంగానీ, చాలా తక్కువ. ఈ కాలంలోనూ ఇలాంటి అశ్లీల చిత్రాలు వస్తున్నాయంటే ఆశ్చర్యంగానే ఉంటుంది.

మరిన్ని సినిమా కబుర్లు
search for those videos