Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

చిత్ర సమీక్ష - అత్తారింటికి దారేది

Movie Review - Attarintiki Daaredi

చిత్రం: అత్తారింటికి దారేది
తారాగణం: పవన్ కళ్యాణ్, సమంత, ప్రణీత, నదియా, ముఖేష్ రుషి, రావు రమేష్, బోమన్ ఇరాని, బ్రహ్మానందం, అలీ, పోసాని కృష్ణమురళి, కోట శ్రీనివాసరావు తదితరులు
ఛాయాగ్రహణం: ప్రసాద్ మురెళ్ళ
సంగీతం: దేవిశ్రీప్రసాద్
నిర్మాణం: శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్
నిర్మాత: బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్
దర్శకత్వం: త్రివిక్రమ్ శ్రీనివాస్
విడుదల తేదీ: 27 సెప్టెంబర్ 2013

క్లుప్తంగా చెప్పాలంటే
ఎక్కడో విదేశాల్లో కోట్లు గడించిన కుటుంబం. అందులో ఓ తాత, ఓ కొడుకు, ఓ మనవడు. అన్నీ వున్నా ఆ తాతకి ఏదో వెలితి. ఆ వెలితి ఎవరో కాదు, ఆ తాత కూతురు. తన తాత కోరిక మేరకు తన అత్తను తాత వద్దకు తీసుకెళ్దామనుకుంటాడు మనవడు. తన ప్రేమ వివాహం విషయంలో తండ్రిని విభేదించిన ఆ కూతురు, తండ్రి నీడను కూడా భరించలేనంత ద్వేషం పెంచుకుంటుంది. కోట్ల కొద్దీ ఆస్తి వున్నా, కుటుంబమంతా కలిసి లేకపోవడం అత్యంత ఆవేదనాభరితమనుకునే ఆ తాతయ్య కోరికను మనవడు నెరవేర్చాడా? మనశ్శాంతి లేని తన కుటుంబంలో ఆనందాన్ని ఎలా నింపాడా మనవడు? ఈ క్రమంలో అతనికి ఎదురైన కష్టాలేంటి? పూర్తి వివరాలు తెలియాలంటే సినిమాని తెరపైనే చూడాలి.

మొత్తంగా చెప్పాలంటే:
పవన్ కళ్యాణ్.. ఆ పేరులోనే పవర్ వుంది. కాబట్టి, పవన్ పెర్ఫామెన్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆరడుగుల బుల్లెట్ అనీ, ఇంకోటనీ పవన్ గురించి ప్రోమోస్ లోనే త్రివిక్రమ్ చెప్పేశాడు, ఆ బుల్లెట్ తెరపై ఇంకా అద్భుతంగా పేలింది. రొటీన్ గానే పవన్ చాలా అందంగా కన్పించాడు. ఎనర్జీ లెవల్స్ ఖుషీ సినిమాని తలపించాయి. సెంటిమెంట్ సీన్స్ లోనూ పవన్ అదరహో అన్పించాడు. యాక్షన్ సన్నివేశాలు పవన్ కి కొట్టిన పిండి. బీభత్సమైన యాక్షన్ కాకుండా, సూపర్బ్ గా, స్మూత్ గా యాక్షన్ సీక్వెన్సెస్ ఎలా చేయొచ్చో పవన్ చూపించాడంతే.

సమంత క్యారెక్టర్ కి తగ్గట్టుగా యాక్టివ్ గా, గ్లామరస్ గా వుంది. సమంతకి ధీటుగా ప్రణీత కూడా గ్లామరస్ గానే కన్పించింది. అత్త పాత్రలో నదియా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆ పాత్రకు ఆమె తప్ప ఇంకెవర్నీ ఊహించుకోలేమేమో. బోమన్ ఇరానీ, ముఖేష్ రుషి, కోట శ్రీనివాసరావు, రావు రమేష్ తదితరులంతా తమ పాత్రల పరిధుల మేరకు రాణించారు. అలీ, బ్రహ్మానందం థియేటర్ల నిండా నవ్వులు పూయించారు.

త్రివిక్రమ్ డైరెక్షన్, దాంతోపాటే అతని మాటలు ప్రేక్షకుల్ని కూర్చున్న సీట్లలోంచి కదలనివ్వవు. త్రివిక్రమ్ మాటలు పవన్ అనే గన్ లోంచి బీభత్సంగా పేలాయనడం అతిశయోక్తి కాకపోవచ్చు. దేవిశ్రీప్రసాద్ సంగీతం, తెరపై బాగా ఎలివేట్ అయ్యింది. ఆడియో సోసోగా వుందనే టాక్ ఇప్పటిదాకా విన్పిస్తే, అది ఈ రోజుతో పటాపంచలయిపోతుంది. ఆడియో ఆల్బమ్ లో నీరసంగా ‘నిన్ను చూడగానే’ పాట అన్పించినా, తెరపై ఆ పాటకే ఎక్కువ విజిల్స్ పడ్తాయి. మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. ఎడిటింగ్, కెమెరాపనితనం.. ఇలా అన్ని విభాగాలూ దర్శకుడికి సహకరించాయి.

ఉద్యమాల దెబ్బ, దానికన్నా పైరసీ దెబ్బ నిర్మాత గుండెని పిండేసినా, సినిమా రిలీజయ్యాక నిర్మాత ఆనందంతో గంతులేసే టాక్ విన్పిస్తోంది. పవన్ కళ్యాణ్ దెబ్బకి పైరసీ మట్టికరిచేస్తుందేమో.

మాటల్లో చెప్పాలంటే: బ్లాక్ బస్టర్ కి దారిది

అంకెల్లో చెప్పాలంటే:  4/5


పవనిజం పవర్ కై ఈ క్రింది లఘు చిత్రాన్ని చూడవచ్చు!

 


 

మరిన్ని సినిమా కబుర్లు
Interview with Singeetam Srinivasa Rao