Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Kaakoolu by Sairam Akundi

ఈ సంచికలో >> శీర్షికలు >>

కనుమరుగైన "కరుణాకర్" - గోతెలుగు.కామ్

RIP Karunakar

తెలుగు పత్రికలు చదివే పాఠకులకు పరిచయం అక్కర్లేని సంతకం స్వర్గీయ శ్రీ కరుణాకర్ గారిది. కథలూ, సీరియల్స్ కి బొమ్మలను వేసేప్పుడు దృశ్యాన్ని ఎంత రమణీయంగా చిత్రించేవారో, కవితలకు భావయుక్తమైన రేఖలతో అంత అద్భుతమైన అనుభూతిని కలిగించేవారు. తెలుగుదనం ఉట్టిపడే అందమైన అమ్మాయిల చీరకట్టులో కనిపించే ఒంపుసొంపులు, చూడచక్కని ముఖ వర్చస్సు, తీరైన ఆకృతులు తీర్చిదిద్దడంలో ఆయనదో ప్రత్యేక శైలి.

ఆయన భౌతికంగా లేకపోయినా ఆ శైలి పదికాలాల పాటు చిత్రకళాభిమానుల హృదయాల్లో నిలిచి ఉంటుందనడంలో సందేహం లేదు. టైం, పంక్చువాలిటీ పాటించడంలో కరుణాకర్ గారి లాంటి ఆర్టిస్టులు బహు అరుదుగా ఉంటారని పబ్లిషర్లు చాలామంది అంటూంటారు. బహుశ పుంఖానుపుంఖాలుగా అనేక పత్రికలకు అందమైన చిత్రాలను సంవత్సరాల పాటు అందించగలగడానికి కారణం అదేనేమో..

గత ఆదివారం సోమాజిగూడా ప్రెస్ క్లబ్ లో జరిగిన కరుణాకర్ గారి సంస్మరణ సభలో ఎందరో చిత్రకారులు, కార్టూనిస్టులు, కళాభిమానులు పాల్గొని ఆయనకు బాధాతప్త హృదయాలతో శ్రద్ధాంజలి ఘటించారు.

- గోతెలుగు.కామ్

మరిన్ని శీర్షికలు
methallu curry