Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
movie

ఈ సంచికలో >> శీర్షికలు >>

19-1-2018 నుండి25-1-2018 వారఫలాలు - - డా. టి. శ్రీకాంత్

మేష రాశి : ఈవారం మొత్తం మీద తలపెట్టిన పనులను కాస్త ఆలస్యంగా నైనా పూర్తిచేసే అవకాశం ఉంది. కుటుంబపరమైన విషయాల్లో పెద్దల నుండి అనుకోకుండా విదేశీ ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో అనుభవజ్ఞుల సూచనల మేర ముందుకు వెళ్ళండి, నూతన పెట్టుబడుల కోసం చేసిన ప్రయత్నాలు సత్ఫాలితాలు ఇస్తాయి. నూతన వాహనాలను కొనుగోలు చేసే విషయంలో బాగా ఆలోచించి ముందుకు వెళ్లడం మంచిది. ఖర్చుల విషయంలో ఏమాత్రం అశ్రద్ధ చేసిన నష్టపోయే అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికారులకు అనుగుణంగా నడుచుకొనుట వలన మేలుజరుగుతుంది. తల్లితరుపు బంధువుల నుండి నూతన విషయాలు తెలుసుకొనే అవకాశం ఉంది.

 

 

 వృషభ రాశి : ఈవారం మొత్తం మీద సాధ్యమైనంత మేర చర్చలు చేయునపుడు కాస్త నిదానంగా వ్యవహరించుట సూచన. మిత్రులతో నూతన విషయాల గురుంచి చర్చలు చేయుటకు అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో నూతన అవకాశాలు పొందుతారు, ఆశించిన మేర పెట్టుబడులకు అవకాశం ఉంది. ప్రయాణాలు అనుకోకుండా వాయిదా పడే అవకాశం ఉంది,  సమయాన్ని వృధా కాకుండా జాగ్రత్తలు పాటించుట మంచిది. భూసంబంధమైన విషయాల్లో నిదానంగా వ్యవహరించుట వలన మేలుజరుగుతుంది. విలువైన వస్తువులను కొనుగోలు చేసే ముందు స్పష్టమైన ఆలోచన అవసరం. విదేశీప్రయాణ ప్రయత్నాలు చేయువారికి అనుకూలమైన సమయం, ముందుకు వెళ్లడం మేలు.

 

 


మిథున రాశి : ఈవారం మొత్తం మీద మిశ్రమఫలితాలు పొందుటకు అవాకాశం ఉంది. చేపట్టిన పనులను మధ్యలో ఆపేసే అవకాశం ఉంది. అనుభవజ్ఞుల సూచనల మేర ముందుకు వెళ్లడం సర్వదా మంచిది. వ్యాపారపరమైన విషయాల్లో వేచిచూసే ధొరణి మేలు. ఎవ్వరితోను మాటపట్టింపులకు వెళ్ళకండి. సంతానపరమైన విషయాల్లో నూతన నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. రుణపరమైన విషయాల్లో కాస్త ఒత్తిడిని పొందుటకు అవకాశం ఉంది. అనుకోకుండా ఆరోగ్య పరమైన ఇబ్బందులను పొందుటకు అవకాశం ఉంది, ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు. విలువైన వస్తువులను నస్టపోయే ఆస్కారం ఉంది. తండ్రి లేదా తండ్రి తరుపు బంధువులతో మనస్పర్థలు ఏర్పడే ఆస్కారం ఉంది, సర్దుబాటు అవసరం.

 

కర్కాటక రాశి : ఈవారం మొత్తం మీద ముఖ్యమైన నిర్ణయాల్లో తొందరపాటు విధానం కలిగి ఉండుట వలన చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొంటారు. ప్రయాణాలు చేయునపుడు నూతన పరిచయాలకు అవకాశం ఉంది. వ్యాపార పరమైన విషయాల్లో లబ్దిని పొందుతారు. కుటుంబపరమైన విషయాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది, పెద్దల అభిప్రాయాల మేర ముందుకు వెళ్ళండి. ఆరోగ్యంలో కొంత ఊరట చెందుతారు, తగిన జాగ్రత్తలు తీసుకోవడం వలన మరింత మంచి ఫలితాలు పొందుటకు అవకాశం ఉంది. జీవిత భగాస్వమి నుండి వచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకోవడం మేలు, వారితో కలిసి సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం కలదు. మిత్రులను కలుస్తారు.

 

 

 సింహ రాశి : ఈవారం మొత్తం మీద మిత్రులతో సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం ఉంది. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేసే అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో నూతన అవకాశాలకు ఆస్కారం ఉంది. సంతానపరమైన విషయాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. సాధ్యమైనంత మేర కోరికలను తగ్గించుకొనే ప్రయత్నం మంచిది. అధికసమయం సరదాగా గడుపుటకు ఆసక్తిని చూపిస్తారు. ఆర్థికపరమైన విషయాల్లో పెద్దలనుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. గతంలో మీకు రావాల్సిన ధనం సమయానికి చేతికి అందకపోవచ్చును. అనుకోకుండా ప్రయాణాలు వాయిదా పడే అవకాశం ఉంది. నూతన పరిచయాలకు అవకాశం ఉంది.

 

కన్యా రాశి : ఈవారం మొత్తం మీద సంతానపరమైన విషయాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. బంధువుల నుండి వచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకోవడం మంచిది. మిత్రులనుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. మీ మాటతీరు పెద్దలకు నచ్చేలా అవకాశం ఉంది, వారితో మీకున్న అనుబంధం మరింతగా బలపడే అవకాశం ఉంది. సోదరులతో చర్చలకు అవకాశం ఉంది, సంతృప్తికరమైన ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంది. కుటుంబ పరమైన విషయాల్లో కీలకమైన ఆలోచనల దిశగా ముందుకు వెళ్ళుటకు అవకాశం ఉంది. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. నూతన నిర్ణయాల విషయంలో తొందరపాటు కూడదు, సర్దుబాటు అవసరం.

 

తులా రాశి :   ఈవారం మొత్తం మీద పెద్దలతో సమయాన్ని గడుపుటకు అవకాశం ఉంది. వారి సూచనల మేర ముందుకు వెల్లడం మంచిది. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుటకు ఆస్కారం ఉంది. చిన్న చిన్న విషయాలకే హైరానా పడే అవకాశం ఉంది. మీ మాటతీరు చాలామందికి నచ్చకపోవచ్చును. సాధ్యమైనంత మేర చర్చలకు దూరంగా ఉండుట సూచన, నూతన ఆలోచనలకు అవకాశం ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన విషయాల పట్ల మక్కువను కలిగి ఉంటారు. కుటుంబపరమైన విషయాల్లో చర్చలు తేలకపోవచ్చును, కొంత నిరాశకి లోనవుతారు. విదేశాల్లో ఉన్న మిత్రుల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. వారితో చర్చలకు అవకాశం ఉంది. 

 

వృశ్చిక రాశి : ఈవారం మొత్తం మీద స్వల్పదూరప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం ఉంది. కోపాన్ని తగ్గించుకోవడం వలన మేలుజరుగుతుంది. అనుకోకుండా ప్రయాణాలు చేయవల్సి వస్తుంది. నూతన వస్తువులను కొనుగోలు చేసే అవకాశం ఉంది. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తగా లేకపోతే నస్టపోయే అవకాశం ఉంది. ఎవరితోనూ మాటపట్టింపులకు వెళ్ళకండి. సర్దుబాటు విధానం కలిగి ఉండుట వలన ఇబ్బందిని ఎదుర్కొంటారు. తండ్రితరుపు బంధువులలో ఒకరి ఆరోగ్యం మిమ్మల్ని ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంది. భూసంబంధమైన విషయాల్లో నూతన నిర్ణయాలు తీసుకొనే ఆస్కారం కలదు.

 

 

ధనస్సు రాశి ఈవారం మొత్తం మీద మీ నిర్ణయాల్లో స్పష్టత ఉండకపోవచ్చును. చేపట్టిన పనులను కాస్త ఆలస్యంగా పూర్తిచేసే అవకాశం ఉంది. పనుల పట్ల మక్కువను కలిగి ఉండుట మంచిది. నూతన పరిచయాలు ఏర్పడుతాయి , వారితో సమయాన్ని సరదగా గడుపుటకు అవకాశం ఉంది. విదేశీప్రయత్నాలు చేయుటకు అవకాశం ఉంది. పెద్దలతో మీకున్న పరిచయం మరింతగా బలపడే ప్రయత్నం చేయుట మంచిది. మీ మాటతీరు కొన్ని వివాదాలకు అవకాశం ఇస్తుంది. స్వల్పదూరప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది. ఆరోగ్యపరమైన విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవడం సూచన. వాహనాల వలన అనుకోని ఖర్చులకు అవకాశం ఉంది . సోదరులతో చర్చలు చేయుటకు అవకాశం ఉంది.

 

మకర రాశి :  ఈవారం మొత్తం మీద ఉద్యోగంలో నూతన అవకాశాలు పొందుతారు, పెద్దలనుండి నూతన సూచనలను వింటారు. తలపెట్టిన పనుల మూలన నలుగురిలో గుర్తింపును పొందుతారు. సాధ్యమైనంత మేర నూతన ప్రయత్నాల కన్నా గతంలో మొదలు పెట్టిన పనులను పూర్తిచేసే ప్రయత్నం చేయుట మంచిది. ప్రయాణాలు చేయునపుడు కాస్త ఇబ్బందులు తప్పకపోవచ్చును, తగిన జాగ్రత్తలు తీసుకోవడం సూచన. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు పొందుటకు అవకాశం ఉంది. విదేశీ ప్రయత్నాలు చేయుటకు అవకాశం ఉంది, నూతన అవకాశాలు పొందుతారు. ఆరోగ్యపరమైన విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవడం వలన మేలుజరుగుతుంది. మిత్రులను కలుస్తారు.
 

కుంభ రాశి : ఈవారం మొత్తం మీద చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. మానసికపరమైన విషయాల్లో కాస్త ఇబ్బందులు కలుగుటకు అవకాశం ఉంది. ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయుట వలన మేలుజరుగుతుంది. మిత్రులతో విభేదాలు వచ్చే ఆస్కారం ఉంది , సర్దుబాటు అవసరం, కాస్త ఆలోచించి ముందుకు వెళ్ళండి. పెద్దల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవడం మంచిది. ఆరోగ్యం విషయంలో కొంత ఊరట ఉంటుంది. కుటుంబపరమైన విషయాల్లో పెద్దలతో కాస్త విభేదాలు వచ్చే అవకాశం ఉంది. అనుకోని ఖర్చులకు ఆస్కారం ఉంది ,  వాటిని తగ్గించుకొనే ప్రయత్నంలో విఫలం అవుతారు.

 

 

మీన రాశి : ఈవారం మొత్తం ఉంది చిన్న చిన్న విషయాలకే హైరానా పడే అవకాశం ఉంది. తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిగా చేసే అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో నూతన అవకాశాలు పొందుతారు. పెద్దలతో మీకున్న పరిచయం మరింతగా బలపడే ప్రయత్నం సఫలీకృతం అవుతుంది. అనుకోకుండా ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. మిత్రులతో కలిసి సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం ఉంది. సంతానపరమైన విషయాల్లో ఒత్తిడి పొందుతారు. దూరప్రదేశంలో ఉన్న బంధువుల నుండి నూతన విషయాలు తెలుసుకుంటారు. తల్లి తరుపు బంధువులలో ఒకరి ఆరోగ్యం మిమ్మల్ని ఆందోళనకు గురిచేసే అవకాశం ఉంది. దైవ పూజలకు సమయం ఇవ్వండి.

 

 

మరిన్ని శీర్షికలు
sarasadarahaasam