నందమూరి హీరో కళ్యాణ్‌రామ్, ఎన్నికల ప్రచామంటున్నాడు, ఘట్టమనేని హీరో ప్రమాణ స్వీకారమంటున్నాడు. ఇవన్నీ సినిమా కోసమే. సూపర్ స్టార్ మహేష్‌బాబు నటిస్తున్న 'భరత్ అను నేను' సినిమా ఫస్ట్‌లుక్‌కి సంబంధించిన ప్రీ అనౌన్స్‌మెంట్‌లో 'ప్రమాణ స్వీకారం' అని పేర్కొన్నారు. నందమూరి కళ్యాణ్‌రామ్ నటిస్తున్న 'ఎమ్మెల్యే' సినిమా గురించి ప్రమోట్ చేస్తూ 'మార్చ్‌లో ప్రచారం' అని అన్నారు. జనవరి 26న మహేష్ నటిస్తున్న 'భరత్ అను నేను' సినిమా ఫస్ట్‌లుక్ రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని రివీల్ చేస్తూ చిత్ర యూనిట్ స్పెషల్‌గా ప్రచారంలోకి దిగింది. ఈ నెల 26న మహేష్ భరత్‌గా ప్రమాణ స్వీకారం అంటూ సంక్రాంతి రోజున ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. అయితే సంక్రాంతికే ఈ ప్రమాణ స్వీకారం జరగాల్సి ఉందట. కానీ కొన్ని కారణాలతో అది కాస్తా రిపబ్లిక్ డేకి వాయిదా పడిందని సమాచారమ్. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌తో రూపొందుతోన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ ఈ చిత్రంలో మహేష్‌తో జోడీ కడుతోంది. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.
షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఏప్రిల్‌లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇకపోతే నందమూరి కల్యాణ్‌రామ్ తాజా చిత్రం 'ఎమ్మెల్యే'. ఎమ్మెల్యే అంటే ఇదేదో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ సినిమా అనే అన్పిస్తోంది మైక్రో టీజర్‌ని చూస్తే. 'ఎమ్మెల్యే' అంటే మంచి లక్షణాలున్న అబ్బాయి అని అర్ధమట. అయితే సినిమా ప్రచారంలో భాగంగా, కళ్యాణ్‌రామ్ క్యాంపెయినింగ్ మార్చిలో ప్రారంభం కానుంది అని ఇన్నోవేటివ్‌గా చిత్ర యూనిట్ పోస్టర్‌తో సహా మైక్రో టీజర్ రిలీజ్ చేసింది. సినిమా మార్చిలో ప్రేక్షకుల ముందుకు రానుందన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ సరసన మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తోంది. ఇవీ ఈ నందమూరి 'ప్రచారం,' ఘట్టమనేని 'ప్రమాణ స్వీకారం'లో దాగున్న నిగూఢ అర్ధాలన్న మాట.
|