Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
namdamoori canvase ghattamaneni sworning

ఈ సంచికలో >> సినిమా >>

ముచ్చటగా మూడోసారీ భయపెట్టేస్తాడట!

third time

 కొరియోగ్రాఫర్‌గా టాప్‌ ప్లేస్‌లో ఉన్న లారెన్స్‌ రాఘవ డైరెక్టర్‌గా మారి, హారర్‌ కామెడీ అనే కొత్త జోనర్‌ని ప్రేక్షకులకు పరిచయం చేశాడు. హారర్‌ చిత్రాలంటే అంతవరకూ భయపెట్టేవే.. కానీ నవ్విచడం అనేది అంతకు ముందు చాలా చాలా తక్కువ అలాంటిది, హారర్‌లోంచే కామెడీని పుట్టించి, అన్ని వర్గాల ప్రేక్షకులు ఎంజాయ్‌ చేస్తూ చూసేలా హారర్‌ చిత్రాల్ని తెరకెక్కించి, సక్సెస్‌ అయ్యాడు లారెన్స్‌ రాఘవ. తానే దర్శకత్వం వహిస్తూ, సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తూ, ఇటు దర్శకుడిగా, అటు హీరోగా మంచి విజయాలు అందుకున్నాడు. లారెన్స్‌ దర్శకత్వంలో, ఈ జోనర్‌లో వచ్చిన తొలి సినిమా 'ముని'. మంచి విజయం అందుకుంది. వేదిక ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఆ తర్వాత 'కాంచన' చిత్రంతో మరోసారి విజయం అందుకున్నాడు లారెన్స్‌. ఈ సినిమా 'ముని'కి సీక్వెల్‌గా తెరకెక్కింది. ఈ సినిమాతో ముద్దుగుమ్మ లక్ష్మీరాయ్‌కి హీరోయిన్‌గా మంచి బ్రేక్‌ వచ్చింది.

'కాంచన' సీక్వెల్‌గా వచ్చిన 'కాంచన - 2' కూడా సక్సెస్‌ అయ్యింది. 'గంగ' టైటిల్‌తో తెలుగులో విడుదలైన ఈ సినిమాలో తాప్సీ హీరోయిన్‌గా నటించింది. ఇలా 'ముని'తో స్టార్ట్‌ చేసిన హారర్‌ జోనర్స్‌తో సీక్వెల్స్‌ మీద సీక్వెల్స్‌ చేసుకుంటూ పోతూ, వరుసగా సక్సెస్‌ల మీద సక్సెస్‌లు కొడుతున్నాడు డైరెక్టర్‌ కమ్‌ హీరో లారెన్స్‌. తాజాగా ఈ సిరీస్‌లో మరో చిత్రం రానుంది. అదే 'కాంచన - 3'. తొలి సినిమా 'ముని'లో నటించిన ముద్దుగుమ్మ వేదిక లాంగ్‌ గ్యాప్‌ తర్వాత ఈ సినిమాలో నటిస్తుండడం విశేషం. మరో హీరోయిన్‌గా కొత్త భామ ఒవియా నటిస్తోంది. ఈ ముద్దుగుమ్మ తెలుగులో తరుణ్‌ హీరోగా నటిస్తున్న 'ఇది నా లవ్‌స్టోరీ' చిత్రంతో తెరంగేట్రం చేస్తోంది. ఇక సినిమా విషయానికి వస్తే, ఈ సినిమాతోనూ లారెన్స్‌ భయపెడుతూ, నవ్వించేందుకు సిద్ధంగా ఉన్నాడట. ఏదేమైనా లారెన్స్‌ సినిమాలు పెద్దలతో పాటు, పిల్లల్నీ అలరిస్తూ ఉంటాయి. అదే లారెన్స్‌ హారర్‌ కామెడీ చిత్రాల్లో ఉన్న స్పెషాలిటీ.

మరిన్ని సినిమా కబుర్లు
'Padmavathi' is going on?