Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
saraina nirnayam

ఈ సంచికలో >> కథలు >> ఆచరణ లో

aacharanalo

రాజ్య లక్ష్మి పనులన్నీ పూర్తి చేసుకుని కార్డ్ లెస్ పక్కన పెట్టుకుని కుర్చీలో కూల పడింది. ఈ మధ్యన వాళ్ళ ఆయన బిఎస్ఎన్ ఎల్ ప్లాన్ మార్చినప్పుడు ఫోన్ కాల్స్ అన్నీ ఫ్రీ అవడంతో రోజూ స్నేహితురాలు కళ్యాణి తో కాలక్షేపం ఎక్కువ అయింది. ఖాళీ ఉన్నప్పుడల్లా కల్యాణి కి  ఫోన్ చేస్తుంది. ఇద్దరూ అన్ని విషయాలూ మాట్లాడుకుంటూ ఉంటోంటే కాలం తెలియదు. కల్యాణి కి డయల్  చేసి కుర్చీలో వెనక్కి చేరగిలా పడింది. కళ్యాణి  వెంఠనే ఎత్తింది

"హలొ రాజ్యం ఏమిటి విశేషాలు?"

ఏమున్నాయి నువ్వే చెప్పాలి

" నిన్న సాయంత్రం మావారు ఒక గురువు గారు గారి దగ్గరికి తీసుకు వెళ్లారు.

" ఆ ఏమి గురువులో ఏమో ఆ మంత్రం చేయి ఇది జరుగుతుంది ఈ హోమం చేయి ఇది జరుగుతుంది. ఇలాంటి వేగా!. చేసినవాళ్ళందరికీ కావలిసిన వన్నీ జరుగుతున్నాయా ?"

" ఈయన చెప్పినవి అలాంటివి కావు"

" మరి ఎం చెప్పారు? ఏమీ ఆశించకుండా పూజలు చేయమన్నాడా?"

" కాదు ఆయన చెప్పినవి చాలా కొత్త గా ఉన్నాయి"

" కొంచెం వివరిస్తావా ?" అంది రాజ్యం సస్పెన్సుకు కొంచెం చిరాకు కలిగి

" మనుషుల ప్రవర్తన గురించి ఆయన చాలా  చెప్పారు. మనం ఎప్పుడూ మనకి తెలుసున్న విషయాల పరిధిలో అవతలి వ్యక్తుల గురించి అభిప్రాయాలు ఏర్పరుచు కుంటాము. అవతలి వ్యక్తుల్ని తొందర పడి  జడ్జి చేసి తప్పు పడుతూ ఉంటాం"

" అంత  కన్న ఇంకేమి చేస్తాము? వాళ్ళ బుర్రలో ఏముందో మనకేమి తెలుస్తుంది?" సందేహం గా అడిగింది రాజ్యం

" ఆయన చెప్పేది ఏమిటంటే అసలు ఎవరు ఏ పని చేసినా ఒక వ్యక్తి లోపల కూర్చుని చెయ్యడట. ఆ వ్యక్తికి వచ్చిన ఆలోచల వల్ల ఆ పనులు అలా జరిగి పోతాయట" కల్యాణి వివరించింది

" అంటే ఎవరయినా  ఆలోచించి చేసిన పనులకి వాళ్ళు బాధ్యులు   కాదని అర్థం రాదూ" ఆశ్చర్యం వెలిబుచ్చింది రాజ్యం

" నీకు ఆలోచనలు వస్తాయా ? లేక నువ్వు తెచ్చుకుంటావా ?  స్వామీజీ అడిగిన పద్ధతి లోనే అడిగింది కల్యాణి

" ఆలోచనలు వస్తాయి. మనం తెచ్చుకోము. తెచ్చుకుంటే వాటిమీద మనకి కంట్రోల్ ఉన్నట్టే కదా?" ఆలోచించి  అంది రాజ్యం

" ఆలోచనలు రావడం లో నీ కంట్రోల్ లో లేదంటే, నువ్వు చేసేపనులకి ఆలోచనే ఆధారమయినప్పుడు పనులకి కూడా ఎవరు బాధ్యులు?"  స్వామీజీ సిదాంతం  విని గుర్తుంచుకున్నది చెప్పింది కల్యాణి

" చిత్రం గా ఉందే . అంటే మన మెడలోంచి ఎవడయినా గొలుసు లాక్కుని వెళ్లి పోయినా అలాగే అనుకుని ఊరు కోవాలా?"

" ఊరుకోమని కాదు. చట్టాల ప్రకారం చేయవలిసింది ఎలగూ  చేయాలి. కానీ ఆయన చెప్పినది గ్రహిస్తే మనం ఆ మనిషిని ద్వేషించం. సంస్కరించడానికి ప్రయత్నిస్తాము"

" అంటే క్రీస్తు  "  సిలువ వేస్తున్నప్పుడు, వాళ్ళేమి చేస్తున్నారో వాళ్లకి తెలియదు"  అని అన్నాడంటే ఆ భావం తోటే అన్నాడేమో?"

అది సరే కానీ మీ అత్తగారు వస్తుందన్నావు వచ్చిందా?" అడిగింది రాజ్యం సంభాషణ మార్చి

" ఆ నిన్ననే దిగబడింది. అందుకనే బెడ్ రూమ్ లోకి వచ్చి మాట్లాడుతున్నాను. వచ్చినప్పటినుంచీ కూతురు విషయాలు చెప్పి విసిగించేస్తోందనుకో ."

" అక్కడి నుంచే వచ్చింది కదా? ఏమిటి విశేషాలు "  కుతూహలం గా అడిగింది రాజ్యం

" ఏమున్నాయి మామూలు సోదే . అవును రాజ్యం! మనుషులు ఇలాకూడా ఉంటారా అనిపిస్తుంది!. ఇక్కడి నుంచి వెళ్ళటప్పుడు అక్కడ మనవరాలికి అది ఇష్టం ఇది ఇష్టం అని అన్నీ మోసుకు పోతుందా? ఇక్కడికి వచ్చేటప్పుడు  అయ్యో మనవడికి ఇష్టమ అని ఓ చాక్ లెట్ ముక్కయినా పట్టుకు రాదు. బామ్మా ఎం తెచ్చావని పిల్ల వెధవ అడిగినా దిక్కు లేదు.అది సరే కానీ వీలు చూసుకుని నువ్వు కూడా రావచ్చు కదా స్వామీజీ ఉపన్యాసాలు చాలా బాగు న్నాయి.

" తప్పకుండా వస్తా " అంటూ ఫోన్ క్రేడిల్ చేసింది రాజ్యం

మరిన్ని కథలు