Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

ఛలో చిత్రసమీక్ష

chalo movie review

చిత్రం: ఛలో 
తారాగణం: నాగ శౌర్య, రష్మిక మండన్న, నరేష్‌, వెన్నెల కిషోర్‌, సత్య, పోసాని కృష్ణమురళి తదితరులు 
సంగీతం: మహతి స్వర సాగర్‌ 
సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరామ్‌ 
దర్శకత్వం: వెంకీ కుడుముల 
నిర్మాత: ఉషా ముల్పూరి 
నిర్మాణం: ఐరా క్రియేషన్స్‌ 
విడుదల తేదీ: 02 ఫిబ్రవరి 2018

క్లుప్తంగా చెప్పాలంటే

చిన్నప్పటినుంచీ గొడవలంటే ఇష్టపడే హరి (నాగశౌర్య)ని అతని తండ్రి నరేష్‌, తిరుప్పురం అనే ఊరికి పంపించేస్తాడు. అక్కడే హరి ఓ కాలేజీలో చేరతాడు. ఆ ఊరిలో తమిళ, తెలుగువాళ్ళ మధ్య గొడవలు జరుగుతుంటాయి. కాలేజీలో హరికి, కార్తీక (రష్మిక) పరిచయమవుతుంది. తొలి చూపులోనే ఆమెతో ప్రేమలో పడతాడు. కానీ వారి ప్రేమకి ఆ ఊరిలోని రెండు వర్గాల మధ్య గొడవలు అడ్డంగా మారతాయి. మరి, తాను ప్రేమించిన కార్తీకని హరి ఎలా పెళ్ళి చేసుకుంటాడు? ఊళ్ళో గొడవల్ని హరి ఎంజాయ్‌ చేశాడా? వాటిని అడ్డుకునేందుకు ప్రయత్నించాడా? అసలు ఆ ఊరిలో గొడవలకు కారణమేంటి? ఈ ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే తెరపై సినిమా చూడాల్సిందే.

మొత్తంగా చెప్పాలంటే

నాగ శౌర్య మంచి ఈజ్‌ ఉన్న నటుడు. క్లాస్‌ లుక్‌లో అయినా, మాస్‌ లుక్‌లో అయినా ఒదిగిపోగలగడం అతని ప్రత్యేకత. మాటల్లో కొంత అమాయకత్వం, ఇంకొంచెం గడుసుదనం కన్పిస్తుంది. అవసరమైతే పక్కా మాస్‌ డైలాగ్‌లు పేల్చగల సత్తా ఉన్నోడు. ఈ సినిమాలో తన పాత్రకి పెర్‌ఫెక్ట్‌గా సూటయ్యాడు. మంచి ఈజ్‌తో తన పాత్రకి ప్రాణం పోసేశాడు. ఒక్కమాటలో చెప్పాలంటే, హరి పాత్రలో నాగ శౌర్య జీవించేశాడనడం అతిశయోక్తి కాదు.

హీరోయిన్‌ రష్మిక మండన్నకి ఇదే తొలి సినిమా. నటిగా మంచి మార్కులేయించుకుంది తొలి సినిమాతోనే ఈ ముద్దుగుమ్మ. ఆమె అందానికీ మంచి మార్కులు పడతాయి. తెలుగు సినీ పరిశ్రమకి మరో టాలెంట్‌ ఉన్న అందమైన హీరోయిన్‌ రష్మిక రూపంలో దొరికిందనిపిస్తుంది. 
కామెడీ పరంగా చూస్తే వెన్నెల కిషోర్‌ పంచ్‌లు బాగా పేలాయి. మిగతా పాత్రధారులంతా తమ పాత్ర పరిధి మేర బాగా చేశారు. 
కథ మరీ కొత్తదేమీ కాదు. చాలా చాలా సినిమాల్లో చూసేసిందే. సరదా సరదా సన్నివేశాలతో, ఇంట్రెస్టింగ్‌గా సినిమాని చెప్పేందుకు ప్రయత్నించాడు దర్శకుడు. కథనం బాగానే ఉంది. సినిమాటోగ్రఫీ సినిమాకి మేజర్‌ ప్లస్‌ పాయింట్‌. సినిమా చాలా రిచ్‌గా కన్పిస్తుంది. పాటలు వినడానికీ, తెరపై చూడ్డానికీ బాగున్నాయి. నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. మాటలు బాగున్నాయి. ఎడిటింగ్‌ అక్కడక్కడా అవసరం అన్పిస్తుంది. కాస్ట్యూమ్స్‌ ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ సినిమాకి ప్లస్‌ అయ్యాయి. రిస్క్‌ చేయకుండా కమర్షియల్‌ సబ్జెక్ట్‌ ఎంచుకున్న దర్శకుడు, ఆ కథకి న్యాయం చేసేందుకోసం ఎంటర్‌టైన్‌మెంట్‌నీ, లవ్‌నీ, కాస్తంత యాక్షన్‌నీ సమపాళ్ళలో వాడిన వైనం బాగుంది. 
ఫస్టాఫ్‌ సరదా సరదాగా సాగిపోతుంది. ఎంటర్‌టైన్‌మెంట్‌, రొమాన్స్‌తోపాటు, ఊరి గొడవలు వంటివన్నీ బోర్‌ కొట్టించకుండా సినిమాలోకి ప్రేక్షకుల్ని తీసుకెళ్ళిపోతాయి. అక్కడక్కడా ఒకటీ అరా బోరింగ్‌ సన్నివేశాలున్నా, అవీ పెద్దగా ఇబ్బందికరం అనిపించవు. విలనిజం విషయంలో ఇంకొన్ని జాగ్రత్తలు తీసుకుని వుంటే ఇలాంటి కథలకు బాగుంటుంది. ఆ ఒక్కటీ మినహాయిస్తే తొలి సినిమా అన్న తడబాటుని దర్శకుడు ఎక్కడా ప్రదర్శించలేదు. హీరోయిన్‌ అందం, నాగశౌర్య ఈజ్‌, వెన్నెల కిషోర్‌ కామెడీ ఈ సినిమాకి మంచి మార్కులేయిస్తాయి. రిచ్‌ లుక్‌, అవసరానికి మించి అనేంతలా సినిమాకి చేసిన పబ్లిసిటీతో సినిమాపై చాలా ఇంట్రెస్ట్‌ క్రియేట్‌ అవడం సినిమాకి ఓపెనింగ్స్‌ పరంగా కలిసొచ్చింది. మౌత్‌ టాక్‌ బాగా స్ప్రెడ్‌ అయి, పబ్లిసిటీ జోరు ఇంకా పెంచితే రిజల్ట్‌ ఇంకా బెటర్‌గా ఉండొచ్చు. ఓవరాల్‌గా సినిమా నిరాశపరచదు, సరదా సరదాగా సాగిపోయిందన్న ఫీలింగ్‌ ప్రేక్షకుడికి కలుగుతుంది.

ఒక్క మాటలో చెప్పాలంటే

'ఛలో' సరదా సరదాగా చూసెయ్యొచ్చు

అంకెల్లో చెప్పాలంటే: 3.25/5

మరిన్ని సినిమా కబుర్లు
cine churaka