Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
Nani trailer is superb

ఈ సంచికలో >> సినిమా >>

సుప్రీం హీరో 'ఇంటెలిజెన్సీ' అదిరిందిగా!

Supreme hero 'intelligence'

మెగా మేనల్లుడు సాయి ధరమ్‌ తేజ్‌ కొత్త చిత్రం'ఇంటెలిజెంట్‌' ప్రమోషన్స్‌ కనీ వినీ ఎరుగని రీతిలో ప్లాన్‌ చేస్తున్నారు. ఇప్పటికే పోస్టర్స్‌ ఎట్రాక్ట్‌ చేస్తున్న తీరు చూస్తుంటే, 'సుప్రీమ్‌'ని మించిపోయిన సక్సెస్‌ ఇస్తాడనిపిస్తోంది ఈ సినిమాతో తేజు. అసలే అక్కడున్నది వినాయక్‌. వినాయక్‌ సినిమాలంటే ఓ అంచనా ఉంటుంది. అసలే మెగాస్టార్‌తో 150వ చిత్రాన్ని తీసి రికార్డులు బద్దలు కొట్టిన ఉత్సాహంలో ఉన్నాడు వినాయక్‌. 'ఖైదీ నెం150' తర్వాత వినాయక్‌ చేస్తున్న చిత్రమిదే. తేజు యాక్షన్‌ ఇరగదీసేశాడట. వినాయక్‌ మార్కు స్క్రీన్‌ప్లేతో సినిమా ఓ రేంజ్‌లో ఉండబోతోందని అంచనా వేస్తున్నారు. సి. కళ్యాణ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

కాగా ప్రమోషన్స్‌లో చిత్ర యూనిట్‌ ఎక్కడా వెనుకాడడం లేదు. పోస్టర్స్‌ డిజైనింగ్‌ సూపర్బ్‌గా ఉందంటూ కామెంట్స్‌ వస్తున్నాయి. మరో పక్క ఆడియో సింగిల్స్‌ పేరు చెప్పి, ఇప్పటికే బాలయ్య, ప్రబాస్‌ వంటి స్టార్స్‌ని బాగా వాడేశాడు తేజు. సినిమా ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ని రాజమండ్రిలో ప్లాన్‌ చేశారు. మెగాస్టార్‌ చిరంజీవి ఈ ఈవెంట్‌కి ప్రధాన ఆకర్షణ కాబోతున్నారట. ఇక హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి గురించి చెప్పాలంటే, ముందు పోస్టర్స్‌లో లావణ్యని చూసేందుకు రెండు కళ్లూ చాలడం లేదు. తేజు - లావణ్య మధ్య కెమిస్ట్రీ సో హాట్‌గా అనిపించినా, చాలా ఎట్రాక్టివ్‌గా కనిపిస్తోంది. అలాగే లావణ్య కొంచెం బొద్దుగా అంతకంటే ముద్దుగా, గ్లామరస్‌గా కనిపిస్తోంది. లావణ్య ఇంతకుముందెన్నడూ కనిపించనంత హాట్‌ ఆప్పీల్‌లో కనిపించనుందని ఈ సినిమా పోస్టర్స్‌ చూస్తుంటేనే ఆ విషయం అర్ధమైపోతోంది. పోస్టర్స్‌లో తేజు, లావణ్య కాస్ట్యూమ్స్‌ కాంబినేషన్‌ కూడా అద్దిరిపోయింది. భారీ అంచనాలతో ఈ సినిమా ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరో పక్క తేజు కోసం వరుణ్‌ తేజ్‌ ఒక్క రోజు వెనక్కి తగ్గాడు. ఒకే రోజు అనగా ఫిబ్రవరి 9నే విడుదల కావాల్సిన వరుణ్‌ తేజ్‌ 'తొలిప్రేమ' ఫిబ్రవరి 10కి పోస్ట్‌పోన్‌ అయ్యింది. 

మరిన్ని సినిమా కబుర్లు
Mass Raja do any experiments