Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
sira first shedule compleate

ఈ సంచికలో >> సినిమా >>

సైనికుడే కాదు ప్రేమికుడు కూడా..

not slodier lover also

లవర్స్‌డే సందర్భంగా అల్లు అర్జున్‌ హీరోగా తెరకెక్కుతోన్న తాజా చిత్రం 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా'లోని రెండో సాంగ్‌ని రిలీజ్‌ చేశారు. ఇది పూర్తిగా రొమాంటిక్‌ సాంగ్‌. మొన్నీ మధ్యన 'సైనికా..' అంటూ వచ్చాడు. ఇప్పుడు 'ప్రేమికా..' అంటూ సందడి చేస్తున్నాడు ఈ పాటతో అల్లు అర్జున్‌. అనూ ఇమ్మాన్యుయేల్‌ ఈ సినిమాలో బన్నీతో జత కడుతోంది. ఈ ఇద్దరి మధ్యా ఆన్‌ స్క్రీన్‌ కెమిస్ట్రీ అదరిపోయేలా ఉండనుందనీ ఈ తాజా పాటలోని స్టిల్స్‌ చూస్తుంటేనే తెలుస్తోంది. సాంగ్‌ ప్రోమోలో అనూ ఇమ్మాన్యుయేల్‌ సో హాట్‌గా కనిపిస్తోంది. పవర్‌ ఫుల్‌ సైనికుడి పాత్రలో కనిపించిన అల్లు అర్జున్‌లో ఓ మంచి 'లవర్‌' కూడా ఉన్నాడనే యాంగిల్‌ ఈ పాట ద్వారా తెలుస్తోంది. తమన్‌ ఈ సినిమాకి మ్యూజిక్‌ అందించాడు. పలు సక్సెస్‌ఫుల్‌ చిత్రాలకు కథలందించిన రచయిత వక్కంతం వంశీ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే.

సమ్మర్‌కి ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే యోచనలో ఉన్నారు. డిఫరెంట్‌ హెయిర్‌స్టైల్‌తో సైనికుడి పాత్రలో చాలా స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు అల్లు అర్జున్‌ ఈ సినిమాలో. 'ఒకవేళ చచ్చిపోవాల్సి వస్తే, ప్రేమను కూడా వదిలేసి బోర్డర్‌కెళ్లి చచ్చిపోతా..' వంటి బీభత్సమైన పవర్‌ఫుల్‌ డైలాగ్స్‌తో అల్లు అర్జున్‌ ఇప్పటికే యూత్‌ని బాగా ఎట్రాక్ట్‌ చేసేస్తున్నాడు. 'డీజె' తర్వాత అల్లు అర్జున్‌ చేస్తున్న చిత్రమిది. వక్కంతం వంశీ కథపై నమ్మకంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఎలాగూ ఉన్నాయి. ఇక తొలిసారి మెగా ఫోన్‌ పట్టిన ఆయన టేకింగ్‌ ఎలా ఉండబోతోందన్నది తెలియాలంటే రిలీజ్‌ డే వరకూ ఆగాల్సిందే మరి. ఏప్రిల్‌ 26న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు మన 'సోల్జర్‌ అండ్‌ లవర్‌ సూర్య'. 

మరిన్ని సినిమా కబుర్లు
rangasthalam record start