Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

మెగా ఫోన్‌ పట్టనున్న నిత్యామీనన్‌

mega phone

హీరోయిన్‌గా స్టార్‌డమ్‌కి భిన్నంగా, టాలెంటెడ్‌ యాక్ట్రస్‌గా ప్రత్యేకమైన పేరు తెచ్చుకున్న ముద్దుగుమ్మ నిత్యామీనన్‌. మలయాళీ బ్యూటీ అయినా కానీ తెలుగులో గలగలా మాట్లాడేస్తుంది. మాట్లాడడమే కాదు, పాటలు కూడా పాడేస్తుంది. ఎలాంటి ఎక్స్‌ప్రెషన్‌ పండించడంలోనైనా దిట్ట. ఇన్ని స్పెషల్‌ క్వాలిటీస్‌ ఉన్న ఈ ముద్దుగుమ్మ త్వరలోనే మరో ప్రమోషన్‌ అందుకోవడానికి రెడీగా ఉందట. అదే దర్శకత్వం. దర్శకురాలిగా మారాలన్నది నిత్యామీనన్‌ కోరికట. ఆల్రెడీ రైటింగ్‌ డిపార్ట్‌మెంట్‌లోనూ తనకి అనుభవం ఉందంటోంది నిత్యామీనన్‌. ఇక త్వరలో దర్శకురాలిగా మారడమేనట. ఎప్పటికైనా ఖచ్చితంగా దర్శకత్వ బాధ్యతలు స్వీకరిస్తాననీ చెబుతోంది నిత్యా. అయినా టాలీవుడ్‌లో హీరోయిన్స్‌కి దర్శకత్వం కొత్తేమీ కాదు.

అలనాటి మేటి నటి విజయ నిర్మల పలు విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించి, మేటి దర్శకురాలు అనిపించుకున్నారు. మరో హీరోయిన్‌ శ్రీప్రియ 'దృశ్యం' సినిమాతో మంచి దర్శకురాలు అనిపించుకున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే, లెక్కలో తక్కువే అయినా కానీ, నటన నుండి వచ్చి, దర్శకత్వంలో సక్సెస్‌ అందుకున్నవారు టాలీవుడ్‌లో ఉన్నారు. అలాంటి వారి సరసన నిలబడేందుకు నిత్యామీనన్‌ సిద్ధపడుతోందనీ తెలుస్తోంది. విభిన్న పాత్రల్లో నటించడానికి ఎప్పటికప్పుడే సై అనే ముద్దుగుమ్మ నిత్యామీనన్‌ తాజాగా 'అ' చిత్రంలో ఓ క్రేజీ పాత్ర పోషించింది. మగోడి లక్షణాలతో ఆ పాత్రలో నటించే సాహసం చేసినందుకు నిత్యాపై ప్రశంసల జల్లు కురుస్తోంది. కొత్త దర్శకుడు ప్రశాంత్‌ వర్మ తెరకెక్కించిన అద్భుత చిత్రం 'అ'. ఈ చిత్రానికి తొలిసారిగా నిర్మాణ బాధ్యతలు స్వీకరించాడు హీరో నాని. 

మరిన్ని సినిమా కబుర్లు
churaka