Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
churaka

ఈ సంచికలో >> సినిమా >>

'సైరా' - సురేందర్‌రెడ్డి చెక్‌ పెట్టాడురా!

siraa

ఒక్క ఫోటోతో అన్ని గాసిప్స్‌కీ చెక్‌ పెట్టేశాడు దర్శకుడు సురేందర్‌ రెడ్డి. బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌తో సురేందర్‌ రెడ్డి దిగిన ఫోటో ఒకటి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. 'సైరా నరసింహారెడ్డి'లో బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ నటించడం లేదంటూ ఈ మధ్య గాసిప్స్‌ వచ్చాయి. అలాగే డైరెక్టర్‌ సురేందర్‌ రెడ్డి కూడా ఈ సినిమా నుండి తప్పుకున్నాడంటూ వార్తలు వినిపించాయి. అయితే ఈ గాసిప్స్‌ అన్నీ ఉత్తవేనంటూ సురేందర్‌ రెడ్డి పెట్టిన పోస్ట్‌ ద్వారా తేలిపోయింది. ఒక్క ఫోటోతో ఈ గాలి గాసిప్స్‌కి చెక్‌ పెట్టేశాడు సురేందర్‌ రెడ్డి. ఆల్రెడీ మొదటి షెడ్యూల్‌ షూటింగ్‌ని సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకున్న 'సైరా' టీమ్‌ రెండో షెడ్యూల్‌ కోసం భారీ ఏర్పాట్లు చేసిందట. ఈ షెడ్యూల్‌లోనే అమితాబ్‌ బచ్చన్‌ పాల్గొననున్నారనీ తెలుస్తోంది.

గతంలో అనుకున్న విధంగా ఈ సినిమాలో చాలా పాత్రలు తప్పుకున్నాయంటూ హాట్‌ హాట్‌గా గాసిప్స్‌ చక్కర్లు కొడుతున్నాయి. వాటిలో ఎంత మాత్రమూ నిజం లేదనీ చిత్ర యూనిట్‌ మొత్తుకుంటున్నా, ఈ గాసిప్స్‌ ఆగడం లేదు. వాటిలో బిగ్‌బీకి సంబంధించిన గాసిప్స్‌కి ఇప్పుడు డైరెక్టర్‌ సురేందర్‌ రెడ్డి చెక్‌ పెట్టేశాడు. అలాగే మిగిలిన గాసిప్స్‌కీ త్వరలోనే చెక్‌ పడనుంది. ఇదిలా ఉండగా, నయనతార విషయంలో కూడా ఇలాంటి గాసిప్సే చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ రెండో షెడ్యూల్‌లోనే నయనతార కూడా పాల్గొననుందనీ చిత్ర యూనిట్‌ నుండి అందిన సమాచారమ్‌. చిరంజీవి 151వ చిత్రంగా తెరకెక్కుతోన్న 'సైరా'కి మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరన్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఎంతో ప్రతిష్ఠాత్మక చిత్రమిది. మరోపక్క ఈ చిత్రంలో ఓ ఇంపార్టెంట్‌ రోల్‌ కోసం రామ్‌చరణ్‌, బాబాయ్‌ పవన్‌ కళ్యాణ్‌ డేట్స్‌ కూడా తీసుకున్నాడనీ సమాచారమ్‌. చూడాలి మరి ఈ వార్తలో నిజమెంతుందో..! 

మరిన్ని సినిమా కబుర్లు
bhrat political ricords vibrations