Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
rashikhanna  crossed success

ఈ సంచికలో >> సినిమా >>

రెజీనా బాలీవుడ్‌లో దూకుడు పెంచేసింది

rezina increased

అందాల రెజీనాకి తాజాగా బాలీవుడ్‌ నుండి ఓ బిగ్‌ ఆఫర్‌ వెతుక్కుంటూ వచ్చింది. 'ఏక్‌ లడకీకో దేఖాతో ఐసా లగా' చిత్రం. లో ఓ ఇంపార్టెంట్‌ రోల్‌ కోసం రెజీనాతో సంప్రదింపులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో రెజీనాతో పాటు సోనమ్‌ కపూర్‌, అనిల్‌ కపూర్‌, రాజ్‌కుమార్‌, జూహీచావ్లా తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. షెల్లీ చోప్రాధర్‌ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు ఈ సినిమాని. తాజాగా ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సినిమాలో ఓ డిఫరెంట్‌ రోల్‌ కోసం చిత్ర యూనిట్‌ రెజీనాని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ భారీ ఆఫర్‌, టాలీవుడ్‌లో తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చిన 'అ' చిత్రంతోనే రెజీనాకి దక్కిందని అంటున్నాయి బాలీవుడ్‌ వర్గాలు. 'అ'లో రెజీనా తన పాత్ర కోసం చూపించిన డెడికేషన్‌కి మెచ్చి ఈ ముద్దుగుమ్మకి ఈ అవకాశం కట్టబెట్టారట. డ్రగ్స్‌కి అలవాటు పడిన అమ్మాయి పాత్రలో ఈ సినిమాలో రెజీనా తనదైన శైలి నటనతో ఆకట్టుకుంటుంది.

ఈ సినిమా కోసం రెజీనా మేకోవర్‌కి మెచ్చి బాలీవుడ్‌లో ఈ తాజా సినిమా కోసం ఆహ్వానం ఇచ్చారట. ఏది ఏమైనా తన బాలీవుడ్‌ ఎంట్రీకి 'అ' చిత్రం ఉపయోగపడినందుకు రెజీనా ఆనందానికి అవధులే లేవు. ఎంట్రీలోనే స్టార్‌ కాస్టింగ్‌తో నటించే బెస్ట్‌ ఛాన్స్‌ కొట్టేసింది అందాల రెజీనా. అసలింతకీ రెజీనాకి ఆఫర్‌ చేసిన ఆ ఇంపార్టెంట్‌ రోల్‌ ఏంటో త్వరలోనే తెలియాల్సి ఉంది. మరో పక్క 'అ' సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చి, కాన్సెప్ట్‌ బేస్‌డ్‌ మూవీగా రికార్డు స్థాయి వసూళ్లతో దూసుకెళ్తోంది. కొత్త దర్శకుడు ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో నాని నిర్మాణంలో ఈ సినిమా రూపొందింది.

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi chooddam