Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

అయ్యో అనూ! ఇలా ఎలా జరిగిందో చెప్మా!

Tell me how this happened!

అందాల అనూ ఇమ్మాన్యుయేల్‌కి ఆఫర్స్‌ మీద ఆఫర్స్‌ రావడంతో ఇంకేముంది స్టార్‌ హీరోయిన్‌ అనిపించుకోవడానికి ఇంకెంతో టైమ్‌ పట్టదనుకున్నారంతా. ఇంకేముంది. అనూ ఇమ్మాన్యుయేల్‌ తప్పితే మరో హీరోయిన్‌ లేదనుకున్నారు కూడా. అంతగా హీరోలందరికీ మెయిన్‌ ఆప్షన్‌ అయిపోయింది అనూ ఇమ్మాన్యుయేల్‌. కానీ ఏ సినిమాతో అయితే ఈ ముద్దుగుమ్మ ఇంతటి ఇమేజ్‌ని సంపాదించుకుందో, ఆ సినిమానే ఈ బ్యూటీ కొంప ముంచేసింది. అదే 'అజ్ఞాతవాసి'. ఈ సినిమాలో ఆఫర్‌ అనగానే మొదట్లో అంతా షాకయ్యారు. ఆ తర్వాత అవును కదా టాలీవుడ్‌లో హీరోయిన్స్‌ కొరత ఆ రేంజ్‌లో ఉంది కదా.

ఈ తరుణంలో అనూ కాక మరింకెవరు? అనిపించింది. అయితే ఒక్క సినిమాతోనే అనూ ఇమ్మాన్యుయేల్‌ ఆశలన్నీ ఆడియాశలైపోయాయి. అనూహ్యంగా 'అజ్ఞాతవాసి' సినిమా ఆశించిన విజయం అందుకోకపోవడంతో ఈ ముద్దుగుమ్మకి వచ్చిన ఆఫర్లు వచ్చినట్లే చేజారిపోయాయి. 'అజ్ఞాతవాసి' తర్వాత చరణ్‌ - బోయపాటి సినిమాకీ అనూనే, ఎన్టీఆర్‌ - త్రివిక్రమ్‌ సినిమాకీ అనూనే హీరోయిన్‌ అనుకున్నారు. కానీ అది కాస్తా రివర్స్‌ అయిపోయింది. చరణ్‌ బాలీవుడ్‌ నుండి కైరా అద్వానీని దించగా, ఇక ఎన్టీఆర్‌ కూడా బాలీవుడ్‌ ముద్దుగుమ్మల సెర్చింగ్‌లోనే ఉన్నాడనీ తెలుస్తోంది. అలా అమాంతం పెరిగిన అనూ ఇమేజ్‌ అంతే వేగంగా డ్యామేజ్‌ అయిపోయింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమాతో పాటు, నాగచైతన్యతో చేస్తున్న 'శైలజారెడ్డి అల్లుడు' చిత్రాలే మాత్రమే ఉన్నాయి. 'అజ్ఞాతవాసి'తో పడిన డ్యామేజ్‌ హోల్‌ని పూడ్చుకోవడానికి ఈ అందాల భామ ఏం కొత్త ప్లాన్‌ వేయనుందో చూడాలి మరి.

మరిన్ని సినిమా కబుర్లు
cine churaka