Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
shriya ready to marriage

ఈ సంచికలో >> సినిమా >>

సంచలనాలకోసం సిద్ధమవుతున్న 'భరత్‌ అను నేను'

bharat anu nenu ovie created sensation

టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు తాజా చిత్రం 'భరత్‌ అనే నేను'. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి డి.వి.వి.దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకి ఏప్రిల్‌ 20ని రిలీజ్‌ డేట్‌గా ఫిక్స్‌ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో మార్చి 6 నుండి ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలు స్టార్ట్‌ చేయనున్నారట. ఈ సినిమాకి ప్రమోషన్‌ని భారీ ఎత్తున నిర్వహించనున్నారనీ తెలుస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 6న 'ద విజన్‌ ఆఫ్‌ భరత్‌' అనే పేరుతో టీజర్‌ని విడుదల చేయనున్నారు. ఆల్రెడీ ఫస్ట్‌లుక్‌ టీజర్‌కి రెస్పాన్స్‌ చాలా బాగా వచ్చింది. ఈ సినిమాలో మహేష్‌బాబు ముఖ్యమంత్రి పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఇటీవల విడుదలైన 'భరత్‌ అనే నేను' అంటూ సాగే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం టీజర్‌కి కూడా రెస్పాన్స్‌ అదిరిపోయిందది. ఇక రానున్న టీజర్‌ని ఎలా కట్‌ చేస్తారో, ఇంట్రెస్టింగ్‌గా అందులో ఏం చూపించబోతున్నారో అంటూ మహేష్‌ అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో మహేష్‌బాబుకు జోడీగా బాలీవుడ్‌ భామ కైరా అద్వానీ నటిస్తోంది. గతంలో కొరటాల శివ - మహేష్‌బాబు కాంబినేషన్‌లో వచ్చిన 'శ్రీమంతుడు' సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. అందుకే ఈ కాంబినేషన్‌ అంటే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్లుగానే, అంతకు మించిన స్థాయిలో 'భరత్‌ అనే నేను' చిత్రం ఆకట్టుకోనుందట. కొరటాల మార్క్‌ కామెడీ, యాక్షన్‌, భావోద్వేగాలకు ఈ సినిమాలో మంచి స్కోప్‌ ఉన్నట్లు తెలుస్తోంది. దేవిశ్రీ ప్రసాద్‌ ఈ సినిమాకి మ్యూజిక్‌ అందిస్తున్నారు. బిజినెస్‌ పరంగా 'భరత్‌ అను నేను'పై భారీ అంచనాలే వున్నాయి. రికార్డుల సంగతంటారా? మార్చి 6 నుంచే అవి షురూ అవుతాయ్‌! 

మరిన్ని సినిమా కబుర్లు
Wow, Varma 'Officer'