Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
bharat anu nenu ovie created sensation

ఈ సంచికలో >> సినిమా >>

వావ్‌, వర్మగారి 'ఆఫీసర్‌' అదరగొట్టేశాడంతే!

Wow, Varma 'Officer'

లాంగ్‌ గ్యాప్‌ తర్వాత రామ్‌గోపాల్‌వర్మ - నాగార్జున కాంబినేషన్‌లో సినిమా రాబోతోంది. ఆ సినిమాకి 'ఆఫీసర్‌' అనే టైటిల్‌ని ఫిక్స్‌ చేశారు. ఈ సినిమాలో నాగార్జున పవర్‌ఫుల్‌ పోలీసాఫీసర్‌ పాత్రలో నటిస్తున్నాడు. పక్కా యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం ముంబయ్‌లో జరుగుతోంది. పవర్‌ ఫుల్‌ యాక్షన్‌ ఘట్టాలను తెరకెక్కిస్తున్నారక్కడ. గతంలో 'శివ', గోవిందా గోవిందా', 'అంతం', తదితర చిత్రాలు రామ్‌గోపాల్‌ వర్మ - నాగార్జున కాంబినేషన్‌లో తెరకెక్కాయి. వీటిలో 'శివ' సంచలన విజయం అందుకుంది. ఆ స్థాయిలో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ఓ పాపని కాపాడే నేపథ్యంలో నాగార్జున చేసే సాహసాలు ప్రధాన కధాంశంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. చాలా కాలం తర్వాత పూర్తి యాక్షన్‌ కథాంశంలో నాగార్జున నటించబోతున్నారు.

కథలోని కంటెన్ట్‌ తనని ఇంప్రెస్‌ చేసే విధంగా ఉండడంతో వర్మ చెప్పిన వెంటనే ఈ సినిమా చేయడానికి నాగార్జున ఒప్పుకున్నారు. ఈ మధ్య వర్మ ఖాతాలో పెద్దగా సక్సెస్‌లు లేవు. అయినా కానీ 'ఆఫీసర్‌' కథ నచ్చడంతో, వర్మపై నమ్మకంతో వెంటనే చేసేద్దాం అన్నారట నాగార్జున ఈ సినిమాని. నాగార్జున నమ్మకానికి తగ్గట్లుగానే సినిమా ఔట్‌పుట్‌ చాలా బాగా వస్తోందనీ ఇన్‌సైడ్‌ సోర్సెస్‌ సమాచారమ్‌. వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్‌ పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే యోచనలో వర్మ - నాగ్‌ ఉన్నట్లు తెలుస్తోంది. 

మరిన్ని సినిమా కబుర్లు
Tragedy shines light on Bollywood pressures