Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

రిచా 'షకీలా' సినిమా మరో 'డర్టీ పిక్చర్‌'!

durty picture

బయోపిక్స్‌ సీజన్‌ నడుస్తున్న ఇటీవలి కాలంలో మరో సెన్సేషనల్‌ బయోపిక్‌ రాబోతోందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. 'షకీలా' ఈ పేరు వింటే ఎవరి గుండెల్లో గంటలు మోగాలో వారి గుండెల్లో గంటల మోత స్టార్ట్‌ అయిపోతుంది. అంతగా పరిచయం అక్కర్లేని పేరిది. మలయాళంలో 'సి' గ్రేడ్‌ సెక్స్‌ సినిమాలకు కేరాఫ్‌ అడ్రస్‌ షకీలా. తెలుగులో కూడా చాలా సినిమాల్లో నటించింది. తెలుగులో షకీలా నటించిన పాత్రలన్నీ వ్యాంప్‌ పాత్రలకు దగ్గరగానే ఉంటాయి. ఐటెం బాంబ్‌ అని చెప్పలేం కానీ, హాట్‌నెస్‌లో అంతకు మించిన స్థాయి ఆమెది. ఇక మలయాళంలో స్టార్‌ హీరోల సినిమాలతో పాటు, షకీలా సినిమాలకు కూడా అక్కడ చాలా క్రేజ్‌ ఉంది. ఇప్పుడూ 'హాట్‌ ఆంటీ' షకీలాపై సినిమా రాబోతోందట. బాలీవుడ్‌ బ్యూటీ రిచా చద్దా ఈ సినిమాలో లీడ్‌ రోల్‌ పోషించనుంది.

షకీలా గురించి తెలిసింది ఎక్కువంటే ఎక్కువ. కాదు చాలా తక్కువే అంటే తక్కువేనట. అయితే ఈ సినిమాలో షకీలా గురించి తెలియని ఎన్నో డిఫరెంట్‌ యాంగిల్స్‌ని తెరపై చూపించనున్నారట. అంతేకాదు మనకి తెలిసిన షకీలా కాకుండా, తాజాగా తెరపై ఆవిష్కృతమయ్యే షకీలాలో పలు భిన్న కోణాలున్నాయట. ఈ సినిమాని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కించనున్నారనీ తెలుస్తోంది. గతంలో ప్రముఖ బాలీవుడ్‌ నటి విద్యాబాలన్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'డర్టీ పిక్చర్‌' సినిమా, హాట్‌ ఐటెం గాళ్‌ అయిన సిల్క్‌స్మిత జీవిత గాధ ఆధారంగా తెరకెక్కి, సంచలనాలే సృష్టించింది. ఆ స్థాయిలో ఇప్పుడీ 'షకీలా' చిత్రం కూడా సెన్సేషన్‌ అవుతుందేమో చూడాలిక. 

మరిన్ని సినిమా కబుర్లు
cine churaka