Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> యువతరం >>

సమ్మర్‌ వెకేషన్‌ ఇలా ట్రై చేసి చూడండి

summer vacation

సమ్మర్‌ సీజన్‌ వచ్చేసింది. ఎగ్జామ్స్‌ ఫీవర్‌ దాదాపుగా తగ్గినట్లే. ఒక్క 10వ తరగతి పరీక్షలు మినహా మిగిలిన తరగతులకు ఎగ్జామ్స్‌ అయిపోయాయి. మరో వారం రోజుల్లో 10వ తరగతి విద్యార్ధులు కూడా చదువుకు టాటా చెప్పేసి, సమ్మర్‌ ఎంజాయ్‌మెంట్‌కి ప్లాన్స్‌ వేసేస్తారు. అయితే ఈ సమ్మర్‌ని ఆనందంగా గడపడంతో పాటు, టైమ్‌ వేస్ట్‌ చేయకుండా, కూసింత క్రియేటివ్‌గా ఆలోచించి చూడండి. ఎంత బావుంటుందో! క్రియేటివ్‌గానే కాదు, ఒకింత అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడమూ ముఖ్యమే. సమ్మర్‌ స్పెషల్‌ ఫర్‌ ఎవ్విరివన్‌ అంటూ చాలా సంస్థలు రకరకాల ఐడియాలతో జనాన్ని ఎట్రాక్ట్‌ చేసేస్తున్నాయి.

సమ్మర్‌ వచ్చిందంటే ఇన్‌డోర్‌, ఔట్‌డోర్‌ సమ్మర్‌ క్యాంప్స్‌ని పలు విద్యా సంస్థలు ఏర్పాటు చేస్తుంటాయి. ఈ హాట్‌ సమ్మర్‌లో కాస్తంత టైమ్‌ని కొంచెం అలా కూడా కేటాయిస్తే, ఈ సమ్మర్‌ హాలీడేస్‌ రెండు నెలల్లోనూ ఏదో ఒక కొత్త విషయాన్ని తెలుసుకున్నామన్న తృప్తి ఇటు విద్యార్ధుల్లోనూ, అటు తల్లితండ్రుల్లోనూ కూడా ఉంటుంది. అందుకే ఈ సమ్మర్‌ క్యాంప్స్‌ విషయంలో తల్లితండ్రులు కొంచెం కొత్తగా ఆలోచన చేస్తే మంచిదంటున్నారు మానసిక నిపుణులు. అమ్మో సమ్మర్‌.. ఎండలు మండిపోతున్నాయి. పిల్లల్ని బయటికి పంపిస్తే వడదెబ్బ కొట్టేస్తుంది. అందుకే మా పిల్లల్ని ఇంట్లోనే ఉంచేస్తున్నాం.

కానీ అల్లరి భరించలేకపోతున్నాం అంటూ తల్లితండ్రులు ఈ సమ్మర్‌ సీజన్‌లో పిల్లలతో నానా తంటాలు పడుతూ ఉంటారు. అందుకే ఒక లిమిటెడ్‌ టైం పెట్టుకుని సమ్మర్‌ క్యాంప్స్‌లో తమ పిల్లలకు సరికొత్త జ్ఞానాన్ని నేర్పించేందుకు ప్రోత్సహించండి. ఈ సమ్మర్‌ క్యాంప్స్‌లో భాగంగా ఆటలు, పాటలు, డాన్సులు, యోగా ఇతరత్రా ప్రోగ్రాంసే కాకుండా, విజ్ఞానాన్ని పెంపొందించే పలు కార్యక్రమాలు నిర్వహించేందుకు నగరంలో విద్యాసంస్థలే కాకుండా ఇతర ప్రైవేటు సంస్థలు కూడా ముందుకొస్తున్నాయి. వాటిని సక్రమ పద్ధతిలో వినియోగించుకొని, సరికొత్త జ్ఞానాన్ని తమ పిల్లల జాబితాలో వేసే ప్రయత్నం చేయండి.

అలాగే యూత్‌ విషయానికి వస్తే, సమ్మర్‌ క్యాంప్స్‌లో భాగంగా ఔట్‌ డోర్‌ వెకేషన్స్‌ని ఎక్కువగా ప్రిఫర్‌ చేస్తుంటారు. అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి ఔట్‌డోర్‌ వెకేషన్స్‌ని ఎంజాయ్‌ చేసే టైంలో కుర్రకారు చిలిపి చేష్టలకు పాల్పడే అవకాశాలున్నాయి. అందుకే అమ్మాయిలు తమ జాగ్రత్తలో తాముండాలి. అలాగే అబ్బాయిలు కూడా. ఇటీవల కాలంలో అమ్మాయిలకే కాదు, అబ్బాయిలకు కూడా సెక్యూరిటీ అవసరమే. వీలైనంతలో ఎవరి సెక్యూరిటీ వారు చూసుకోవాలి. ఫ్రెండ్సే అయినా అందరినీ గుడ్డిగా నమ్మరాదు. ఇప్పుడు కెమెరా కళ్లు చాలా చిన్నవైపోయాయి. కానీ ఎంత పెద్ద విషయాన్ని అయినా బహిర్గతం చేసేంత స్మార్ట్‌ అయిపోయాయి. సో ఏ పుట్టలో నుండి ఏ కెమెరా కన్ను, ఏ పరిస్థితుల్లో మనల్ని వాచ్‌ చేస్తుందో ఊహించడం, కనిపెట్టి పట్టుకోవడం కష్టం. అయితే అసాధ్యం అయితే కాదు. అందుకే ఔట్‌ డోర్‌ వెకేషన్స్‌లో జర జాగ్రత్త సుమీ! సరదా అనేది సంతోషంగా ఉండాలి. కానీ విషాదాంతం కాకూడదు. ఉడుకు రక్తం. దేని వెంటైనా పరుగెత్తాలనిపిస్తుంది. ఏదైనా చేసేయ్యాలన్న ధైర్యం. వెనక ఆలోచన చేయనివ్వదు. అందుకే ప్రియమైన యువతా! కాస్త ఆచి తూచి ఆలోచించండి. మీరు చేసే ప్రతీ పని వెనక మీ ఫ్యామిలీ మీ భవిష్యత్తు ఆధారపడి ఉన్నదనీ మర్చిపోకండి. హాట్‌ సమ్మర్‌ని కూల్‌ థాట్స్‌తో హ్యాపీగా ఎంజాయ్‌ చేసేయండి. 

మరిన్ని యువతరం
be carefull