Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
bumra gossips rashikhanna

ఈ సంచికలో >> సినిమా >>

కళ్యాణ్‌రామ్‌ రాజకీయాల్లోకి వస్తాడా?

Will Kalyanam enter politics

ప్రేక్షకులు తనను సినిమాల్లో ఇక చూడలేమనే నిర్ణయానికి వస్తే, సినిమాలు మానేసి రాజకీయాల్లోకి వస్తానన్నాడు కళ్యాణ్‌రామ్‌. సరదాగా అన్నాడో, సీరియస్‌గా అన్నాడో మరి. 'ఎమ్మెల్యే' సినిమా ప్రమోషన్‌లో అందరూ కళ్యాణ్‌రామ్‌ని రాజకీయాల గురించే ప్రశ్నించారు. 'మీ తాత పార్టీ కదా, ఆ పార్టీని మీరే తీసుకోవాలి' అని ఓ సినీ ప్రముఖుడు 'ఎమ్మెల్యే' సినిమా ఈవెంట్‌లో కళ్యాణ్‌రామ్‌ని ప్రత్యక్షంగానే అడిగేశాడు. దాంతో సమాధానం చెప్పలేక ఇబ్బంది పడ్డాడు. కళ్యాణ్‌రామ్‌ తండ్రి హరికృష్ణ, రాజకీయాల్లో యాక్టివ్‌గానే వుండేవారు. స్వర్గీయ ఎన్టీఆర్‌ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో కీలక వ్యక్తిగా పనిచేశారాయన. ఎన్టీఆర్‌ 'చైతన్యరధం' మీద జనంలోకి వెళితే, ఆ చైతన్య రధం అనే వాహనానికి హరికృష్ణ డ్రైవర్‌గా వుండి, తన తండ్రిని కంటికి రెప్పలా కాపాడుకున్నారు.

అలా ఎన్టీఆర్‌ టైంలో హరికృష్ణ రాజకీయ పాత్ర కీలకం అని చెప్పొచ్చు. ఈ జనరేషన్‌కొచ్చేసరికి యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ కూడా 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేశారు. అందుకే ఎన్టీఆర్‌కీ రాజకీయ సెగ మెల్ల మెల్లగా తగులుతోంది. ఎన్టీఆర్‌తో పాటు, కళ్యాణ్‌రామ్‌, తారకరత్న తదితరులకీ ఎన్నికల్లో ప్రచారం చేసిన అనుభవం వుంది గతంలో. అయితే ఇదంతా పరోక్షంగానే. చంద్రబాబు ముందుండగా, వెనక నుండి మాత్రమే ఈ యంగ్‌ ఎన్టీఆర్‌ గణం రాజకీయాల్లో ప్రచార కర్తలుగా సత్తా చాటింది. అయితే ప్రత్యక్ష రాజకీయాల్లోకి నందమూరి యంగ్‌ తరంగ్‌ ఎప్పుడొస్తుందో చూడాలిక. 

మరిన్ని సినిమా కబుర్లు
keerthi suresh is miracle