Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Superhit movie in five languages

ఈ సంచికలో >> సినిమా >>

కుంభకోణంలో ఇరుక్కున్న యువ హీరో

kumbhakonamlo young hero

యువ హీరో నిఖిల్ కుంభకోణంలో ఇరుక్కున్నాడు. కుంభకోణం అంటే కోట్లు నొక్కేయడం కాదు. ఈ కుంభకోణం తమిళనాడులోని ఓ ప్రాంతం. ‘కార్తికేయ’ అనే సినిమా కోసం తమిళనాడులోని కుంభకోణంలో షూటింగ్ జరుగుతోంటే, ఆ షూటింగ్లో నిఖిల్ పాల్గొంటున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోంది ఈ సినిమా. తెలుగులో ‘కార్తికేయ’, తమిళంలో ‘కార్తికేయన్’గా రాబోతోంది.

విశేషమేమంటే ఈ సినిమా కోసం తమిళ వెర్షన్ కీ నిఖిల్ తానే డబ్బింగ్ చెప్పుకుంటున్నాడు. ఇంతకుముందు వరకూ నిఖిల్ కి తమిళ్ పెద్దగా రాదు, ఇప్పుడే నేర్చుకుంటున్నాడు, నేర్చుకుని డబ్బింగ్ చెప్పబోతున్నాడు. నిఖిల్ ఇలా తమిళ భాషపై పట్టు కోసం ప్రయత్నిస్తోంటే, సినిమా యూనిట్ ఆశ్చర్యపోతోంది అతని డెడికేషన్ కి.

‘హ్యాపీడేస్’ బ్యాచ్ లో ఓ కుర్రాడిగా నటించిన నిఖిల్, తెలుగులో చాలా సినిమాలే చేశాడుగానీ, ‘స్వామిరారా’ సినిమాతోనే అతనికి మంచి గుర్తింపు వచ్చింది. ‘కార్తికేయ’ సినిమాతో  గ్యారంటీగా హిట్ కొడ్తాననే ధీమా అతనిలో కన్పిస్తోంది.

మరిన్ని సినిమా కబుర్లు
Is pawan kalyan going to start political party?