Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
kumbhakonamlo young hero

ఈ సంచికలో >> సినిమా >>

పవన్ పార్టీ పెడతాడా?

Is pawan kalyan going to start political party?

స్వర్గీయ ఎన్టీఆర్ పార్టీ పెట్టి, ప్రభంజనం సృష్టించారు. అది ఓ చరిత్ర. ఎన్టీఆర్ లాగానే.. అని రాజకీయాల్లో కొచ్చి కొత్త పార్టీ పెట్టిన
చిరంజీవి, ఘోరంగా దెబ్బతిన్నారు. గెలుపోటములు రాజకీయాల్లో మామూలేగానీ, పార్టీ పెట్టి, దాన్ని నడపలేక ఇంకో పార్టీలో కలిపేయడం ద్వారా చిరంజీవి తన అభిమానుల్లోనూ గౌరవం కోల్పోయారు.

ఒకప్పటి రాజకీయాలకీ, ఇప్పటి రాజకీయాలకూ వున్న తేడాలూ చిరంజీవి తను పెట్టిన పార్టీని కాంగ్రెస్ లో కలిపేయడానికి కారణమంటారు కొందరు. కారణాలు ఏవైనప్పటికీ ఈ రోజుల్లో పార్టీ పెట్టి, దాన్ని నడపడం చాలా కష్టమైన విషయం. అన్నయ్య దెబ్బతిన్నాక కూడా, తమ్ముడు పార్టీ పెడితే బావుణ్ణని అభిమానులెవరూ కోరుకోరు.

కానీ, రామ్ గోపాల్ వర్మ అలా కాదు. పవన్ పార్టీ పెట్టేదాకా ఊరుకునేట్టు లేడు. పార్టీ పెట్టాల్సిందేనంటూ ట్విట్టర్ ద్వారా పవన్ పై ‘వార్’
కొనసాగిస్తున్నాడు వర్మ. ఇదో టైపు పబ్లిసిటీ స్టంట్ అని కొందరు అంటోంటే, పవన్ ఇమేజ్ కి అతను పార్టీ పెట్టాలని వర్మ కోరుకోవడంలో
తప్పేముందంటున్నారు ఇంకొందరు.

సామాజిక బాధ్యత విషయంలో ఆపదలో వున్నవారికి తనకు చేతనైనంత సహాయం చేయడం వరకూ పవన్ ముందుంటారు.. అదీ పబ్లిసిటీకి దూరంగా. కానీ, రాజకీయాల పట్ల పవన్ ఏనాడూ ఆసక్తి చూపలేదు. అన్నయ్య కోసం పార్టీ తరఫున ప్రచారమైతే చేశాడుగానీ, రాజకీయాల్లోకి రావాలనుకోలేదు. కాబట్టి, పవన్ పార్టీ పెట్టే అవకాశాలైతే భవిష్యత్తులో కన్పించడంలేదు.

మరిన్ని సినిమా కబుర్లు
same like nitin to varun