Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
ala enduku doosukelthunnado

ఈ సంచికలో >> సినిమా >>

బూతు చిత్రాలతో ధన రాశులా..

collections for adult movies

ఐదు కోట్లు పెడితేగానీ ఓ మోస్తరు సినిమా రూపొందించడం కష్టంగా మారింది. పోనీ, అంతా ఖర్చు చేసినా, సినిమాకి వసూళ్ళు వస్తాయో రావో చెప్పలేకపోతున్నారు. అయితే, తక్కువ డబ్బుతో ఎక్కువ డబ్బులెలా సంపాదించాలో బూతు సినిమాలు చూపిస్తున్నాయి. హిందీలో ఇదే ట్రెండ్ నడుస్తోంది.

మలయాళంలో ఎప్పటినుంచో వుందీ ట్రెండ్. అయితే యూ ట్యూబ్ కారణంగా ఈ ట్రెండ్ మళ్ళీ ఇప్పుడు జోరందుకుంటోంది. సినిమా తీసేసి, య్యూట్యూబ్ లో రిలీజ్ చేసేస్తే దానికి హిట్స్ అదిరిపోయే రేంజ్ లో వస్తాయి, అందులో సెక్సువల్ కంటెంట్ వుంటే. బాలీవుడ్ లో ‘నషా’ సినిమాకి ఇలానే జరిగింది. 72 గంటల వ్యూయింగ్ టైమ్ కేటాయిస్తారు, 100 రూపాయలు టిక్కెట్ పెట్టినా సరిపోతుంది. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాల్లో పబ్లిసిటీ ఖర్చు తగ్గుతుంది.. పోస్టర్ల ఖర్చు కూడా వుండదు.

ఓ నలభై లక్షల్లో సినిమా తీసేయగలిగితే చాలు. అయితే మంచి సినిమాలకు ఇలాంటివి వర్కవుట్ అవవు. కాసిన్ని హాట్ ఎలిమెంట్స్ పెట్టేసి, యూ ట్యూబ్ని నమ్ముకుంటే బూతు సినిమాలు తీసేవారికి యూట్యూబ్ కనక వర్షం కురిపించేస్తుంది.

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi chooddam