Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
venky with milk beauty

ఈ సంచికలో >> సినిమా >>

వర్మని ఇంప్రెస్‌ చేసిన కొత్త భామ

varma impressed

వర్మ సినిమాలో హీరోలైనా, హీరోయిన్‌లైనా ప్రత్యేకంగా ఉంటారు. ముఖ్యంగా వర్మ హీరోయిన్స్‌ దారే వేరు. చాలా విభిన్నంగా ఉంటారు. అంతవరకూ ఆ దృష్టితో చూడకపోయినా, వర్మ దృష్టి కోణంలో ఏముంటుందో తెలీదు. హీరోయిన్‌ ఫీచర్స్‌ని ఇట్టే పలికించేస్తాడు వారిలో. అలా వర్మ పరిచయం చేసిన ముద్దుగుమ్మలు ఎందరో. అంతెందుకు తాజాగా వర్మ తెరకెక్కిస్తున్న 'ఆఫీసర్‌' సినిమా కోసం మిరా సరీన్‌ అనే కొత్త భామనిప్పుడు టాలీవుడ్‌కి పరిచయం చేస్తున్నాడు. గతంలో పలువురు హీరోయిన్లు ఇప్పుడు రాధికా ఆప్టే, తేజస్విని తదితరులు వర్మ లిస్టు నుండి తెరంగేట్రం చేసిన వారే. అలా ఇప్పుడు మరో కొత్త భామని వర్మ పరిచయం చేయబోతున్నాడు. ఆమె ఓ కన్నడ హీరోయిన్‌. కన్నడలో ఈ ముద్దుగుమ్మ నటించిన 'తగరు' అనే చిత్రం ఇటీవల వర్మ చూశాడట.

ఆ సినిమాలో హీరోయిన్‌గా నటించిన మాన్వితా హరీష్‌పై వర్మ మనసు పడ్డాడట (హీరోయిన్‌గా). అంతే ఆమెను హీరోయిన్‌గా పెట్టి ఓ సినిమా చేస్తానని అనౌన్స్‌ చేసేశాడు. తనకి ఏది అనిపించినా, ముందుగా అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ ఇచ్చేస్తాడు వర్మ. అలా ఇప్పుడు వర్మ ఖాతాలో హీరోయిన్‌గా ఈ ముద్దుగుమ్మ చేరిపోయింది. ఈ ముద్దుగుమ్మ కోసం ఎంత రెమ్యునరేషన్‌ అయినా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానంటున్నాడు వర్మ. అంతగా ఆ భామలో ఏముందో, వర్మని ఇంతగా ఇంప్రెస్‌ చేసేసింది. ఇదిలా ఉంటే, వర్మ సినిమాలో నటించడానికి మాన్వితా కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేసింది. త్వరలోనే మాన్వితాతో వర్మ చేయబోయే సినిమా వివరాలు వెల్లడి కానున్నాయి. 

మరిన్ని సినిమా కబుర్లు
akhil movie