Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

కృష్ణార్జున యుద్ధం చిత్రసమీక్ష

krishnarjuna yuddham movie review

చిత్రం: కృష్ణార్జున యుద్ధం 
తారాగణం: నాని (ద్విపాత్రాభినయం), అనుపమ పరమేశ్వరన్‌, రుక్సార్‌ మీర్‌, బ్రహ్మాజీ, రవి ఆవానా, సుదర్శన్‌, దేవదర్శి, ప్రభాస్‌ శ్రీను తదితరులు. 
సంగీతం: హిఫ్‌ హాప్‌ తమిఝ 
సినిమాటోగ్రఫీ: కార్తీక్‌ ఘట్టమనేని 
దర్శకత్వం: మేర్లపాక గాంధీ 
నిర్మాతలు: సాహు గారపటి, హరీష్‌ పెద్ది 
నిర్మాణ సంస్థ: షైన్‌ స్క్రీన్స్‌ 
విడుదల తేదీ: 12 ఏప్రిల్‌ 2018

క్లుప్తంగా చెప్పాలంటే 
ఓ పల్లెటూరి కుర్రాడు కృష్ణ (నాని), ఓ డాక్టర్‌ని ప్రేమిస్తాడు. ఎక్కడో యూరోప్‌లో రాక్‌స్టార్‌ అయిన తెలుగు కుర్రాడు అర్జున్‌ (నాని), పేరుకి ప్లేబాయ్‌ లాంటోడే అయినా, పద్ధతిగా వుండే పదహారణాల తెలుగమ్మాయి సుబ్బలక్ష్మి (అనుపమ పరమేశ్వరన్‌) ప్రేమలో పడతాడు. కృష్ణ ప్రేమించిన డాక్టర్‌ రియా (రుక్సార్‌), అర్జున్‌ ప్రేమించిన సుబ్బలక్ష్మి (అనుపమ) అనుకోకుండా ఒకే చోట మిస్‌ అవుతారు. ఇంతకీ వారేమయ్యారు? కృష్ణ, అర్జున్‌ ఎలా కలిశారు? అసలేంటి మిగతా కథ? అన్నది తెరపై చూస్తేనే బావుంటుంది.

మొత్తంగా చెప్పాలంటే 
నాని అంటే నేచురల్‌ స్టార్‌. నటించడం కాదు, జీవించేస్తాడు ఏ పాత్రలో అయినా. ఈ సినిమాలోనూ అదే చేశాడు. కృష్ణ పాత్రలో పల్లెటూరితనం, అర్జున్‌ పాత్రలో రాక్‌స్టార్‌ 'ఇజం' అన్నీ పెర్‌ఫెక్ట్‌గా చూపించాడు. రెండు పాత్రల్లోనూ వంకలు పెట్టడానికేమీ దొరకవు. సింపుల్‌గా చెప్పాలంటే నాని నటుడిగా మరోసారి తానేంటో ప్రూవ్‌ చేసుకున్నాడు. హీరోయిన్లలో అనుపమ, రుక్సార్‌ ఇద్దరూ అందంగానే వున్నారు. అయితే అనుపమ, రుక్సార్‌ని ఒకింత ఓవర్‌ టేక్‌ చేసేస్తుందని చెప్పొచ్చు. నటనలోనూ, అందంలోనూ ఇద్దరూ ఒకరితో ఒకరు పోటీ పడ్డారనడం అతిశయోక్తి కాకపోవచ్చు. బ్రహ్మాజీ కామెడీ టైమింగ్‌కి మార్కులు బాగా పడతాయి. మిగతా పాత్రధారులంతా మమ అన్పించేశారు.

కథ మరీ కొత్తదేమీ కాదు, అలాగని పాతదీ కాదు. సినిమా చూస్తున్నంతసేపూ పలు సినిమాలు రిఫరెన్స్‌కి వస్తాయి. డైలాగ్స్‌ ఆకట్టుకుంటాయి. కథనం పరంగా కొంత గందరగోళం కన్పించింది. ఎడిటింగ్‌ సెకెండాఫ్‌లో బాగా అవసరం అన్పిస్తుంది. కాస్ట్యూమ్స్‌, ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ తమ పని తాము చేశాయి. సినిమాకి బాగా ప్లస్‌ అయిన అంశం బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. పాటలు కొత్తగా అనిపిస్తాయిగానీ, ఆకట్టుకునేవి తక్కువే. నిర్మాణపు విలువల పరంగా ఎక్కడా రాజీ పడని వైనం కన్పిస్తుంది. రిచ్‌గా సినిమాని రూపొందించారు.

నానితో సినిమా అంటే ఎలా వున్నా గట్టెక్కేస్తుందనే భావన అందరిలోనూ వుంది. అది నిజమని పలు సినిమాలు నిరూపించాయి. ఈ నేపథ్యంలో మేర్లపాక గాంధీ కొంచెం కొత్తగా ట్రై చేశాడు. అందుకు అతన్ని అభినందించాలి. ప్యారలల్‌గా రెండు పాత్రల్ని (కృష్ణ, అర్జున) నడిపిన వైనం అలరిస్తుంది. అయితే, సెకెండాఫ్‌కి వచ్చేసరికి గందరగోళం ఎక్కువైపోయింది. ఫస్టాఫ్‌ చూశాక, సినిమాపై నమ్మకం పెరిగితే, సెకెండాఫ్‌ మొదలైన కాస్సేపటికే సినిమాపై నమ్మకం సడలిపోతుంది. ఫస్టాఫ్‌పై పెట్టినంత ఫోకస్‌ సెకెండాఫ్‌ మీద కూడా పెట్టి వుంటే, సినిమాకి రిజల్ట్‌ బెటర్‌గా వచ్చేదని నిస్సందేహంగా చెప్పొచ్చు. కొన్ని కామెడీ సన్నివేశాలు, నాని నటన, హీరోయిన్ల అప్పీయరెన్స్‌ ఇవన్నీ సినిమాకి ప్లస్‌ పాయింట్స్‌ అయితే, సెకెండాఫ్‌ మైనస్‌ అని చెప్పొచ్చు.

ఒక్క మాటలో చెప్పాలంటే 
బాక్సాఫీస్‌ యుద్ధాన్ని గెలవడం ఆషామాషీ కాదండోయ్‌!!

అంకెల్లో చెప్పాలంటే: 3/5

మరిన్ని సినిమా కబుర్లు
churaka