Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
tollywood time mission is back

ఈ సంచికలో >> సినిమా >>

కోలీవుడ్‌లో దూస్కెళ్తోన్న పెళ్లిచూపులు బ్యూటీ

pellichoopulu beauty

షార్ట్‌ ఫిలిం బ్యాక్‌ గ్రౌండ్‌ నుండి, బిగ్‌స్క్రీన్‌కి ఎదిగిన స్టార్‌ ముద్దుగుమ్మ రీతూ వర్మ. మొదట్లో హీరోయిన్‌ ఫ్రెండ్స్‌ క్యారెక్టర్స్‌, చెల్లెలి క్యారెక్టర్స్‌లో నటించిన ఈ బ్యూటీకి సడెన్‌గా 'పెళ్లి చూపులు' రూపంలో గోల్డెన్‌ ఛాన్స్‌ తగిలింది. విమర్శకుల ప్రశంసలతో పాటు, సూపర్‌ సక్సెస్‌ మూవీగా మంచి విజయం అందుకుంది 'పెళ్లిచూపులు' సినిమా. ఆ తర్వాత రీతూ వర్మ పేరు మార్మోగిపోయింది. యాక్టింగ్‌ పరంగా, క్రేజ్‌ పరంగా కూడా. నైట్‌కి నైట్‌ స్టార్‌ అయినంత ఈజీగా వరుస అవకాశాలు మాత్రం వెనకేసుకోలేకపోయింది

ఈ ముద్దుగుమ్మ. టాలీవుడ్‌లో ఈ బ్యూటీకి పెద్దగా ఆఫర్లు రాలేదు కానీ, కోలీవుడ్‌ మాత్రం రెడ్‌ కార్పెట్‌ పరిచేసింది. ఏకంగా స్టార్‌ హీరోల్లో ఒకరైన విక్రమ్‌ సరసన 'ధృవ నక్షత్రం' సినిమాలో నటించే బంపర్‌ ఛాన్స్‌ కొట్టేసింది. ఒక్క దెబ్బకి రెండు పిట్టలన్నట్లుగా, విక్రమ్‌తో జత కట్టడం ఓ ఎత్తయితే, ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్న డైరెక్టర్‌ గౌతమ్‌ మీనన్‌తో పని చేయడం మరో ఎత్తు. ఆయనతో సినిమా చేయాలని చాలా మంది నటీనటులు కలలు గంటారు. ఆ కల అనుకోకుండా, రీతూవర్మకి ఇంత త్వరగా నెరవేరుతుందని నిజానికి ఆమె కూడా ఊహించలేదట. ఏదో గ్లామర్‌ కోసం కాకుండా, ఈ సినిమాలో యాక్టింగ్‌కి స్కోపున్న పాత్ర దక్కిందట రీతూ వర్మకి. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పాటు, తమిళంలో మరో రెండు చిత్రాల్లో ఈ బ్యూటీ ఆఫర్‌ దక్కించుకుందని తెలుస్తోంది. అందులో దుల్కర్‌ సల్మాన్‌తో ఓ సినిమాలో నటిస్తోంది. ఇదే కాక తెలుగులో కూడా ఈ బ్యూటీ ఓ క్రేజీ ఆఫర్‌ని దక్కించుకున్నట్లుగా తాజా సమాచారమ్‌.

మరిన్ని సినిమా కబుర్లు
hot item bhama