Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
cine churaka

ఈ సంచికలో >> సినిమా >>

చిరంజీవి పెద్దరికం నిలబడుతుందా?

Will Chiranjeevi grow up?

ట్రెండ్‌ మారింది. సినీ పరిశ్రమలో కొత్త పోకడలు కనిపిస్తున్నాయి ఎవరూ ఎవరి మాటనీ లెక్కచేసే పరిస్థితి లేదు. దాసరి నారాయణరావు లెక్క వేరు. 150 సినిమాలకు పైగా దర్శకత్వం వహించిన ఘనుడు. నటుడు, నిర్మాత, దర్శకుడు.. ఇలా చాలా కోణాలున్నాయి ఆయనలో. ఆయన మీద కులం ముద్ర ఎవరూ వేయలేదు. చిరంజీవి విషయంలో అలా కాదు, చిరంజీవిని కొందరు సినీ పరిశ్రమలో వ్యతిరేకిస్తారు. అర్ధం పర్ధం లేని విమర్శలు చేస్తారు. పైగా చిరంజీవి చాలా సౌమ్యుడు, సెన్సిటివ్‌ కూడా. సినీ పరిశ్రమలో నెలకొన్న తాజా పరిణామాలపై ఇటీవల ఓ మీటింగ్‌ ఏర్పాటు చేశారు చిరంజీవి. ఆ మీటింగ్‌లో పలువురు పాల్గొని వివిధ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా చిరంజీవి చొరవని చాలా మంది అభినందించారు. అయితే చిరు పెద్దరికాన్ని కొందరు అర్ధం పర్ధం లేకుండా వ్యతిరేకిస్తున్నారట.

అది చిరంజీవికి కొంత మనస్థాపం కలిగించిందని సమాచారమ్‌. పరిశ్రమ అంతా ఒక్క తాటిపై ఉండాలని చిరంజీవి ఆకాంక్షిస్తూ ఈ మీటింగ్‌ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు చిరంజీవి రీ ఎంట్రీలో హీరోగా 'ఖైదీ నెం150' సినిమాతో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కొట్టి, రికార్డులు తిరగరాశాడు. 151వ సినిమా 'సైరా నరసింహారెడ్డి' చిత్రంలో నటిస్తున్నాడు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత గాధ ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది. బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ ఈ సినిమాలో మెగాస్టార్‌ చిరంజీవితో కలిసి నటిస్తున్నారు. నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లో మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ నిర్మిస్తున్నారు. 

మరిన్ని సినిమా కబుర్లు
Rajasekhar with 'A' director