Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
kalyan ram suspense triller

ఈ సంచికలో >> సినిమా >>

'ఎన్టీఆర్‌'కి హ్యాండిచ్చిన తేజ

teja handed over to NTR

ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర్‌' బయోపిక్‌ నుండి డైరెక్టర్‌ తేజ తప్పుకున్నట్లుగా ప్రకటించి, అందరికీ షాక్‌ ఇచ్చాడు. ఇటీవల పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో ఈ సినిమా గ్రాండ్‌గా లాంచ్‌ అయ్యింది. ఆల్రెడీ కొన్ని సీన్స్‌ చిత్రీకరణ కూడా జరిగింది. ఈ తరుణంలో తేజ ఈ బయోపిక్‌ దర్శకత్వం నుండి తప్పుకోవడంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

తేజ తప్పుకోవడంతో ఇప్పుడు బయోపిక్‌ సందిగ్థంలో పడింది. 'ఎన్టీఆర్‌' బయోపిక్‌కి తాను న్యాయం చేయలేననే ఉద్దేశ్యంతోనే తేజ ఈ సినిమా నుండి తప్పుకున్నట్లు వెల్లడించాడు. కానీ కథ విషయంలో బాలయ్యకూ, తేజకు మధ్య ఏకాభిప్రాయాలు సెట్‌ కావడం లేదనీ, చాలా విషయాల్లో బాలయ్యతో తేజ ఏకీభవించలేకపోతున్నాడనీ, ఆ కారణంగానే వీరి మధ్య విబేధాలు రావడంతో తేజ పక్కకు తప్పుకున్నాడనీ తెలుస్తోంది. అయితే అర్ధాంతరంగా తేజ 'ఎన్టీఆర్‌' బయోపిక్‌ నుండి బయటికి రావడంతో ఇప్పుడీ ప్రాజెక్ట్‌ని టేకప్‌ చేయగల సత్తా ఉన్న డైరెక్టర్‌ ఎవరనే ప్రశ్న తలెత్తుతోంది. అయితే మరో డైరెక్టర్‌తో ఈ సినిమాని బాలయ్య కంటిన్యూ చేస్తారా? లేక అలాగే వదిలేస్తారా? అనే విషయం తేలాల్సి వుంది. అయితే తేజ ఈ ప్రాజెక్ట్‌ నుండి తప్పుకోగానే, సీనియర్‌ డైరెక్టర్‌ అయిన రాఘవేంద్రరావు పేరు వెలుగులోకి వచ్చింది. ఈ తరుణంలో ఆయన మాత్రమే ఈ సినిమాని హ్యాండిల్‌ చేయగలరేమో అని కొందరు భావిస్తున్నారు. కానీ చూడాలి మరి ఏం జరుగుతుందో.!

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi chooddam