Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
two hundred not out

ఈ సంచికలో >> సినిమా >>

'సమ్మోహన'పరిచిన ఇంద్రగంటి

indrakanti mesmerising

'సాహిత్యం, సినిమా ఎప్పటికీ అలాగే ఉంటాయి అంటాడు తండ్రి. కాదు సినిమా ఉండదు, సాహిత్యం ఉంటుందేమో అంటాడు హీరో..' ఆ హీరో ఎవరో కాదు, సుధీర్‌ బాబు. ఈయనకి సినిమాలంటే అస్సలు ఇష్టముండదు. సినిమాలు డర్టీ అంటాడు. అలాంటి ఈ కుర్రోడు ఓ సినిమా హీరోయిన్‌తో లవ్‌లో పడతాడు. అదే ఈ సినిమా స్టోరీ. ఇంతకీ సినిమా ఏమనుకుంటున్నారు కదా. 'సమ్మోహనం'. సుధీర్‌బాబు, అదితీరావ్‌ హైదరీ జంటగా తెరకెక్కుతోందీ చిత్రం. విభిన్న కథా చిత్రాల దర్శకుడు ఇంద్రగంటి మోహన్‌కృష్ణ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇటీవల టాలీవుడ్‌ని కుదిపేసిన 'కాస్టింగ్‌ కౌచ్‌' విషయాన్ని ఈ సినిమాలో ప్రస్థావించినట్లుగా ఈ సినిమా టీజర్‌ని బట్టి అర్ధమవుతోంది. ఈ మధ్యకాలంలో సినీ పరిశ్రమలో నిజాయితీ అనే మాట ఎక్కువగా వినిపిస్తోంది.

అంటే యదార్ధ ఘటనలన్నమాట. యదార్ధ ఘటనల ఆధారంగా తెరకెక్కుతోన్న పలు చిత్రాలకు ఆదరణ బాగా దక్కుతోంది. ఇటీవల రికార్డుల మోత మోగించిన 'రంగస్థలం' సినిమా విషయంలో సుకుమార్‌కి ఎలాంటి ప్రశంసలు దక్కాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అలాగే మహేష్‌బాబుతో కొరటాల శివ తెరకెక్కించిన 'భరత్‌ అనే నేను' చిత్రానికి అలాంటి ప్రశంసలే దక్కాయి. అలాంటి సినిమాల లిస్టులోకే ఈ 'సమ్మోహనం' చేరనుందట. ఓ యదార్ధ ఘటనను బేస్‌ చేసుకుని ఇంద్రగంటి ఈ స్క్రిప్టు ప్రిపేర్‌ చేశారట. సుధీర్‌బాబు మంచి నటుడు. తెలుగులో హీరోగా నటిస్తూనే, హిందీలో ప్రతినాయకుడిగానూ కనిపించి మెప్పించాడు. ఈ సినిమాలో డిఫరెంట్‌ షేడ్‌ హీరోయిజం చూపించబోతున్నాడట. అతి త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi chooddam