Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
bhavalu lekunda merugga jevinchagalam kada

ఈ సంచికలో >> శీర్షికలు >>

11-5-2018 నుండి 17-5-2018 వారఫలాలు - డా. టి. శ్రీకాంత్

మేష రాశి : ఈవారం మొత్తం మీద ఆరంబంలో కొద్దిగా ఒడిదుడుకులను ఎదుర్కొంటారు. స్పష్టమైన ఆలోచన అవసరం . తొందరపాటు నిర్ణయాల వలన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అధికారుల సూచనల మేర ముందుకు వెళ్ళండి. ఉద్యోగంలో బాగానే ఉంటుంది, నూతన పనులను చేపట్టుటకు అవకాశం ఉదని, వేచిచూసే ధోరణి వలన తప్పక మేలుజరుగుతుంది. ముఖ్యమైన నిర్ణయాలను వ్యాపారపరమైన విషయాల్లో తీసుకుంటారు. ఆరోగ్యపరమైన విషయాల్లో కాస్త జాగ్రత్తగా వ్యవహరించుట సూచన. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. నూతన ప్రయత్నాలు మొదలు పెట్టుటకు ఆస్కారం ఉంది. కొన్ని విషయాల్లో మౌనంగా ఉండుట సూచన.

 

 

 

 వృషభ రాశి :  ఈవారం మొత్తం మీద బంధువులను కలుస్తారు , వారితో సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం ఉంది. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం ఉంది. నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. పెద్దలతో మీకున్న పరిచయం మరింతగా బలపడే ఆస్కారం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో నూతన అవకాశాలు పొందుతారు. ఆరోగ్యపరమైన విషయాల్లో ఏమాత్రం అశ్రద్ధ వద్దు, తగిన జాగ్రత్తలు తీసుకోవడం సూచన. ముఖ్యమైన విషయాల్లో నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. మిత్రులతో మీ ఆలోచనలను పంచుకుంటారు, వారినుండి వచ్చిన అభిప్రయాలను పరిగణలోకి తీసుకోవడం వలన మేలుజరుగుతుంది.



మిథున రాశి : ఈ వారం మొత్తం మీద ఉద్యోగంలో నూతన ప్రయత్నాలు మొదలు పెట్టుటకు అవకాశం ఉంది. కొన్ని కొన్ని విషయాల్లో మీ మొండితనం వలన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. సంతాన పరమైన విషయాల్లో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. చేపట్టిన పనులను తోటివారి సహకారంతో పూర్తిచేస్తారు.

 

 

కర్కాటక రాశి : ఈ వారం మొత్తం మీద నూతన ఉద్యోగ ప్రయత్నాలు మొదలు పెట్టుటకు ఆస్కారం ఉంది. చర్చలకు అవకాశం ఇవ్వకండి , సర్దుబాటు విధానం కలిగి ఉండుట మంచిది. ఆర్థికపరమైన విషయాల్లో పెద్దలనుండి ఆశించిన విధంగా సహకారం కాస్త ఆలస్యంగా లభిస్తుంది. రుణపరమైన విషయాల్లో మీకు రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. జీవిత భాగస్వామి నుండి వచ్చిన సూచనలు పరిగణలోకి తీసుకోవడం వలన మేలుజరుగుతుంది. విదేశీ ప్రయాణ అవకాశాలు ఉన్న , పరిస్థితులు పెద్దగా కలిసి రాకపోవచ్చును. కుటుంబంలో పెద్దలనుండి వచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకోవడం మంచిది. విలువైన వస్తువుల కోసం ధనాన్ని ఖర్చు పెట్టుటకు అవకాశం ఉంది.

 

 

 సింహ రాశి : ఈవారం మొత్తం మీద సాధ్యమైనంత మేర చర్చలకు దూరంగా ఉండుట సూచన. తలపెట్టిన పనులను పూర్తిచేసేలా ప్రణాలిక సిద్ధం చేసుకోవడం మంచిది. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు ఉన్న, సంతృప్తిని పొందుతారు. గతంలో చేపట్టిన పనులకు గాను పెద్దలలో గుర్తింపును పొందుతారు. ఆరంభంలో చిన్న చిన్న సమస్యలు ఏర్పడే ఆస్కారం ఉంది. సర్దుబాటు విధానం అలాగే వేచిచూసే ధొరణి మేలుచేస్తుంది. అనుకోకుండా చేసే ప్రయాణాలు లబ్దిని కలిగిస్తాయి. సోదరులతో చేపట్టిన చర్చలు మధ్యలో ఆగిపోయే అవకాశం ఉంది. విదేశాల్లో ఉన్న వారు స్వదేశానికి తిరిగి వచ్చే ఆస్కారం ఉంది. వాహనాల విషయంలో మాత్రం జాగ్రత్త అవసరం.

 

కన్యా రాశి :ఈవారం మొత్తం మీద మీ ఆలోచనలను పెద్దలకు తెలియజేసే అవకాశం ఉంది. వారినుండి వచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకోవడం మంచిది. వ్యాపారపరమైన విషయాల్లో బాగానే ఉంటుంది , గతంలో మొదలు పెట్టిన పనులు ముందుకు సాగుతాయి. మీ మాటతీరు విషయాల్లో కాస్త చూసుకోండి , వివాదాలకు దూరంగా ఉండుట వలన తప్పక మేలుజరుగుతుంది. బంధువులను కలుస్తారు, వారితో కలిసి నూతన ప్రయత్నాలు చేయుటకు అవకాశం ఉంది. సంతానపరమైన విషయాల్లో నూతన నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం అలాగే విశ్రాంతి తీసుకోవడం వలన మేలుజరుగుతుంది, ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు.

 

తులా రాశి :  ఈవారం మొత్తం మీద నూతన ప్రయత్నాలకు అవకాశం ఇస్తారు , చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. గతంలో మొదలు పెట్టిన చర్చల్లో పురోగతి ఉండకపోవచ్చును. ఉద్యోగంలో మీరు తలపెట్టిన నూతన ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. కుటుంబసభ్యుల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. ఆరోగ్యం విషయంలో బాగానే ఉంటుంది. దూరప్రదేశ ప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది. గతంలో మీకున్న పరిచయాల వలన నూతన సమస్యలు వచ్చుటకు ఆస్కారం ఉంది , జాగ్రత్త. విలువైన వస్తువులను నష్టపోయే అవకాశం ఉంది , జాగ్రత్త

 

 

 

వృశ్చిక రాశి : ఈవారం మొత్తం మీద సంతానపరమైన విషయాలకు సమయం ఇస్తారు, నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. ఆర్థికపరమైన విషయాల్లో పెద్దలనుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. ఖర్చులు కూడా అదేస్థాయిలో ఉండే అవకాశం ఉంది. మీ మాటతీరు పెద్దలకు నచ్చుతుంది, వారినుండి సహకారం పొందుతారు. జీవితభాగస్వామి తో కలిసి దూర ప్రదేశ ప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది. ఆరోగ్యపరమైన సమస్యలు మిమ్మల్ని ఇబ్బందికి గురిచేస్తాయి. స్థిరాస్తి కొనుగోలు చేయు విషయంలో అనుభవజ్ఞుల సూచనల మేర ముందుకు వెళ్ళండి. మిత్రులతో మీ ఆలోచనలు పంచుకుంటారు.
 

ధనస్సు రాశి ఈవారం మొత్తం మీద కుటుంబపరమైన విషయాల్లో కీలకమయిన ఆలోచనలు చేయుటకు అవకాశం ఉంది. తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. సంతానపరమైన విషయాల్లో నూతన నిర్ణయాలకు ఆస్కారం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో కాస్త ఒడిదుడుకులను ఎదుర్కొఅంటారు. వేచిచూసే ధోరణి తప్పక మేలుజరుగుతుంది. మీ మాటతీరు కొంతమందికి నచ్చక పోవచ్చును. రుణపరమైన విషయాల్లో ఇబ్బందులు తప్పక పోవచ్చును. పెద్దలతో కలిసి ప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది. నూతన వస్తువులను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది, విలువైన వస్తువులను జాగ్రత్తగా పరిరక్షణ చేసుకోవడం సూచన.

 

మకర రాశి : ఈవారం మొత్తం మీద స్వల్పదూర ప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది. చేపట్టిన పనులను కాస్త ఆలస్యంగా పూర్తిచేసే అవకాశం ఉంది. ఉద్యోగంలో పెద్దలనుండి వచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకోవడం మంచిది. నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వాహనాలను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. మానసికంగా దృడంగా ఉండుట వలన కొన్ని కొన్ని విషయాల్లో మేలుజరుగుతుంది. మిత్రులతో విభేదాలు రాకూండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. విదేశాల్లో ఉన్న బంధువుల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. కుటుంబంలో నూతన ఆలోచనలకు ప్రాధాన్యం ఇస్తారు. సంతానం వలన కొంతమేర ఒత్తిడికి గురయ్యే ఆస్కారం ఉంది.

 

 

కుంభ రాశి :  ఈవారం మొత్తం మీద ఎవ్వరితోను మాటపట్టింపులకు వెళ్ళకండి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు లేక వ్యాపార ప్రయత్నాలు కలిసి వస్తాయి. చేపట్టిన పనుల విషయంలో స్పష్టత కలిగి ఉండుట మంచిది. మిత్రులనుండి వచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకోవడం మంచిది. దైవపరమైన విషయాలకు సమయం ఇవ్వడం వలన తప్పక మేలుజరుగుతుంది. పెద్దలతో మీకున్న పరిచయం మరింతగా బలపడేలా మీ ఆలోచనలు చేయుట మంచిది. చర్చల్లో సాధ్యమైనంత మేర నిదానంగా వ్యవహరించుట సూచన. ఆరోగ్యపరమైన ఇబ్బందులు తప్పక పోవచ్చును. విదేశాల్లో ఉన్న మిత్రులనుండి ముఖ్యమయిన సమాచారం పొందుతారు. నిదానం మీ మిత్రువు అని గమనించుట సూచన.
 

మీన రాశి : ఈవారం మొత్తం మీద ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఫలితాలు కాస్త ఆలస్యంగా వచ్చే అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. ఆర్థికపరమైన విషయంలో నూతన అవకాశాలు పొందుతారు. బంధువుల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. సంతానపరమైన విషయాల్లో కీలకమయిన ఆలోచనల దిశగా అడుగులు వేస్తారు. గతంలో మీకు రావాల్సిన ధనం కొద్దిగా కొద్దిగా చేతికి అందుతాయి. నూతన పరిచయాలకు అవకాశం ఉంది, వారినుండి నూతన విషయాలు తెలుస్తాయి. నూతన అవకాశాలు పొందుతారు, వాటిని అందిపుచ్చుకొనే ప్రయత్నం చేయుట సూచన. వ్యాపార పరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు.

మరిన్ని శీర్షికలు
plastic devil