Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
counter attack

ఈ సంచికలో >> సినిమా >>

కేథరీన్‌ లక్కు.. ఇస్తుందా మెగా కిక్కు.!

catherene luck


అదృష్టం అంటే కేథరీన్‌దే అనాలి. మెయిన్‌ హీరోయిన్‌గా ప్రమోషన్‌ దక్కట్లేదు కానీ, అవకాశాలకేం లోటుండట్లేదు ఈ ముద్దుగుమ్మకి. తాజాగా ఈ బ్యూటీని మెగా ఛాన్స్‌ వరించిందంటూ ప్రచారం జరుగుతోంది. బోయపాటి శీను - మెగా పవర్‌స్టార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమాలో కేథరీన్‌ చోటు దక్కించుకుందట. ఈ సినిమాలో కేథరీన్‌ ఓ స్పెషల్‌ సాంగ్‌ చేయబోతోందని ప్రచారం జరుగుతోంది. ఆల్రెడీ బోయపాటి శీను డైరెక్షన్‌లో రెండు సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ, ఈ సినిమాతో హ్యాట్రిక్‌ కొట్టబోతోంది. మెగా కాంపౌండ్‌ హీరో అయిన స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌తో ఆల్రెడీ హ్యాట్రిక్‌ కొట్టేసింది కేథరీన్‌.

'ఇద్దరమ్మాయిలు' సినిమాలో సెకండ్‌ హీరోయిన్‌గా నటించి టాపు లేపేసింది. తర్వాత, 'రుద్రమదేవి', 'సరైనోడు' చిత్రాల్లో నటించింది. ఇకపోతే ఏకంగా మెగాస్టార్‌తో స్టెప్పులేసే అవకాశాన్ని తృటిలో మిస్‌ చేసుకుంది కేథరీన్‌. చిరంజీవి 150వ సినిమా 'ఖైదీ'లో 'రత్తాలు..' సాంగ్‌ కేథరీన్‌ చేయాల్సింది. కొన్ని కారణాలతో మిస్‌ అయ్యింది. ఇప్పుడు మళ్లీ మెగా పవర్‌స్టార్‌తో ఆ ఛాన్స్‌ దక్కించుకోబోతందట. బోయపాటి శీనుకు కేథరీన్‌ లక్కీ గాళ్‌. సెంటిమెంట్‌ కూడా. అందుకే పక్కాగా తన సినిమాలో కేథరీన్‌ని ఫిక్స్‌ చేస్తాడని భావిస్తున్నారు. ఒకవేళ ఆ ఛాన్స్‌ దక్కించుకుంటే, మెగా పవర్‌స్టార్‌తో హాట్‌ హాట్‌ స్టెప్పులేసేందుకు ఈ హాట్‌ బ్యూటీ రెడీనే మరి. ఈ సినిమాలో చరణ్‌కి జోడీగా 'భరత్‌' బ్యూటీ కైరా అద్వానీ నటిస్తోంది. 
 

మరిన్ని సినిమా కబుర్లు
real gold boy