Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
catherene luck

ఈ సంచికలో >> సినిమా >>

కుర్రాడు నిజంగానే బంగారు 'కొండ'

real gold boy

'పెళ్లిచూపులు' సినిమాతో రాత్రికి రాత్రే స్టార్‌ అయిపోయాడు. 'అర్జున్‌రెడ్డి'తో సంచలన హీరో అయిపోయాడు. ఆ తర్వాతి నుండీ విజయ్‌ దేవరకొండ అంటే సమ్‌థింగ్‌ స్పెషల్‌ ఇంట్రెస్ట్‌ని క్రియేట్‌ చేస్తున్నాడు. ముఖ్యంగా యూత్‌లో బాగా క్రేజ్‌ సంపాదించేసుకున్నాడీ యంగ్‌ హీరో తనదైన నటనా శైలితో. అందుకే హీరోగానే కాకుండా, స్పెషల్‌ క్యారెక్టర్స్‌తోనూ, హి ఈజ్‌ ది స్పెషల్‌ వన్‌ అనిపించుకుంటున్నాడు. హీరోగా 'టాక్సీవాలా', 'నోటా', 'డియర్‌ కామ్రేడ్‌' చిత్రాల్లో నటిస్తున్నాడు. ఏం సినిమా చేస్తున్నామన్నది కాదురా, సినిమాలో ఎంత వైవిధ్యం ఉన్నదన్నది ఇంపార్టెంట్‌ అంటాడు మన విజయ్‌ దేవరకొండ.

అందుకే విజయ్‌ దేవరకొండ సినిమాలకు అంత క్రేజ్‌ ఏర్పడింది. పైన చెప్పుకున్న ఈ మూడు చిత్రాలూ ఒకదానికొకటి విభిన్న కథా చిత్రాలే కావడం విశేషం. వీటిలో 'మై డియర్‌ కామ్రేడ్‌' చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ వారు నిర్మిస్తుండడం మరో విశేషం. కాగా ఈ విలక్షణ నటుడికి తెలుగుతో పాటు, తమిళంలో కూడా మంచి మార్కెట్‌ ఏర్పడింది. తాజాగా 'మహానటి' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు విజయ్‌ దేవరకొండ. ఈ సినిమాలో సమంతకి లవర్‌గా నటించి, తన నేచురల్‌ నటనతో సినిమాకి వెయిట్‌ తీసుకొచ్చాడు. త్వరలోనే 'టాక్సీవాలా' చిత్రంతో ప్రేక్షకులను పలకరించనున్నాడు క్రేజీయెస్ట్‌ హీరో విజయ్‌ దేవరకొండ. 

మరిన్ని సినిమా కబుర్లు
rakul in touch