Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
real gold boy

ఈ సంచికలో >> సినిమా >>

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ టచ్‌లోనే ఉంది

rakul in touch


తెలుగులో స్టార్‌ హీరోయిన్‌గా వెలుగొందిన ముద్దుగుమ్మ రకుల్‌ ప్రీత్‌సింగ్‌ ఇప్పుడు తెలుగు సినిమాలకి కాస్త బ్రేక్‌ ఇచ్చింది. తమిళంలో వరుస సినిమాలతో బిజీగా గడుపుతోంది. ఆల్రెడీ కార్తితో 'ఖాకీ' సినిమాలో నటించి, విజయం అందుకుంది. మళ్లీ ఇంకో సినిమాకి కార్తితో కమిట్‌ అయ్యింది. సూర్యతో ఓ సినిమాలో నటిస్తోంది. ముచ్చటగా మూడో సినిమాకీ సైన్‌ చేసింది తమిళంలో రకుల్‌ ప్రీత్‌సింగ్‌. 'రెమో' సినిమాతో తొలి సినిమాకే విజయం అందుకున్న శివ కార్తికేయన్‌తో రకుల్‌ ఓ సినిమాలో నటిస్తోంది. ఇలా ప్రస్తుతం తమిళంలో వరుస సినిమాలతో బిజీగా ఉన్న రకుల్‌ ప్రీత్‌సింగ్‌, మొట్టమొదటి సినీ తెరంగేట్రం తమిళంలోనే మొదలైంది.

ఆ తర్వాతే తెలుగులోకి వచ్చింది. అయితే మొదట్లో తమిళంలో రకుల్‌కి అంతగా కలిసి రాలేదు. తెలుగులో స్టార్‌డమ్‌ వచ్చాక తమిళంలో స్టార్‌ రివర్స్‌ అయ్యింది. దాంతో ఇప్పుడిప్పుడే తమిళనాట స్ధిరపడుతోంది. మరోపక్క బాలీవుడ్‌లో కూడా రకుల్‌ హవా బాగానే కొనసాగుతోంది. తొలి సినిమా 'అయ్యారీ'పై భారీ ఆశలు పెట్టుకుంది రకుల్‌ప్రీత్‌సింగ్‌. కానీ ఆ సినిమా భారీగా నిరాశపరచడంతో రకుల్‌ కొంత అప్‌సెట్‌ అయిన మాట వాస్తవమే కానీ, ఆ ఫెయిల్యూర్‌ రకుల్‌కి పెద్దగా నష్టం చేకూర్చలేదనిపిస్తోంది. ఎందుకంటే, లేటెస్ట్‌గా రకుల్‌ బాలీవుడ్‌లో అజయ్‌దేవ్‌గన్‌తో ఓ సినిమాలో నటించే ఛాన్స్‌ కొట్టేసింది. అజయ్‌దేవగన్‌కి ప్రియురాలి పాత్రలో నటించే ఆఫర్‌ వచ్చిందట. టబు ఈ సినిమాలో మరో కీలక పాత్ర పోషిస్తోంది. టబు కన్నా, రకుల్‌కే ఎక్కువ ఇంపార్టెన్స్‌ ఉండబోతోందట. అలా రకుల్‌ బాలీవుడ్‌తో టచ్‌లోనే ఉందండోయ్‌. 

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi chuddam