Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
cine churaka

ఈ సంచికలో >> సినిమా >>

తెలుగు సినిమాకి కావాల్సిందిదే.!

rangasthalam equations change

'రంగస్థలం' సినిమా రిలీజై 40 రోజులు దాటేసింది. మామూలుగా అయితే శుక్రవారం సినిమా రిలీజైతే, సోమవారానికి ఆ సినిమా మర్చిపోవాల్సిందే. ఇటీవల కాలంలో తెలుగు సినిమా పరిశ్రమలో నెలకొన్న పరిస్థితి ఇది. కానీ 'రంగస్థలం' రాకతో ఈక్వేషన్స్‌ మారిపోయాయి. 50 రోజులకు దగ్గరవుతున్నా ఈ సినిమా వసూళ్ల గురించి ఇంకా మాట్లాడుకుంటున్నాం. 'రంగస్థలం' ఒక్కటే కాదు, 'రంగస్థలం' బాటలో ఆ తర్వాత వచ్చిన సూపర్‌స్టార్‌ 'భరత్‌ అనే నేను' కూడా అదే పరిస్థితి. మిక్స్‌డ్‌ టాక్‌ వచ్చినా అల్లు అర్జున్‌ 'నా పేరు సూర్య' సినిమా కూడా బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల పంట పండిస్తోంది. ఇప్పుడు 'మహానటి' హవా కొనసాగుతోంది.

ఊహించని విధంగా 'మహానటి' కూడా బాక్సాఫీస్‌ వద్ద జోరుగా వసూళ్లు కలెక్ట్‌ చేస్తోంది. 'రంగస్థలం' 125 కోట్లు షేర్‌ సాధించింది. 'భరత్‌ అనే నేను' 100 కోట్లకు దగ్గర పడింది. 'నా పేరు సూర్య' 50 కోట్లు దాటేసింది. ఇప్పుడు 'మహానటి' ఎంత వసూలు చేస్తుందో చూడాలి. తెలుగు సినిమా ఇంతకు మించిన విజయాల్ని అందుకోవాలి. ఈ మధ్య తెలుగు సినిమా పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. 'రంగస్థలం' రాకతో మొత్తం ఈక్వేషన్స్‌ తారుమారయ్యాయి. ఊహించని విధంగా, అందరూ ఆశ్చర్యపడేలా బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురుస్తోంది. చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేకుండా బాక్సాఫీస్‌ కళకళలాడుతోంది. తెలుగు సినిమాకి ఇంతకన్నా కావాల్సిందేముంది. ఎప్పుడూ తెలుగు సినిమా బాక్సాఫీస్‌ ఇలాగే నిండుగా వర్ధిల్లాలని కోరుకుందాం. 

మరిన్ని సినిమా కబుర్లు
milky beauty with kalyan ram