Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> యువతరం >>

టచ్‌ చేసి చూడకు షాకై పోతావ్‌.!

dont touch

అమ్మాయి ఒంటరిగా కనిపించిందనీ, కెలకడానికి ట్రై చేశావో నీ జీవితం ఖర్సయిపోతది కుర్రోడా.! ఏంటిది? ఎలా ? అనుకోవద్దు అమ్మాయిలకు అండగా చాలా గాడ్జెట్స్‌ అందుబాటులోకి వచ్చేశాయి. చేతిలో ఇమిడిపోయే చాలా చిన్న పరికరం, అడుగున్నర పొడవైన స్టిక్‌లా మారిపోతోంది. ఆ స్టిక్‌ దెబ్బ తింటే, ఎలాంటోడైనా నొప్పితో విలవిల్లాడాల్సిందే. ఎలక్ట్రిక్‌ టచ్‌తో కూడిన స్టార్ట్‌ స్టిక్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. టచ్‌ చేస్తే దిమ్మ తిరిగేలా షాక్‌ ఇస్తాయవి. మెళ్లో పెండెంట్‌, చెవి పోగు, చేతి వాచ్‌, కాలికి బ్యాండ్‌ వాట్‌ నాట్‌ ఏదైనా సరే ఆకతాయిలకు అమ్మో అనిపించేలా బుద్ది చెప్పగలవు. ఇలాంటి స్మార్ట్‌ డివైజర్స్‌ ఎక్కడో అభివృద్ధి చెందిన దేశాల్లో మాత్రమే పప్పులో కాలేసినట్లే. ప్రపంచం చాలా స్మార్ట్‌గా తయారైంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇదో స్మార్ట్‌ విలేజ్‌.

ఎక్కడో అమెరికాలో ఓ ప్రొడక్ట్‌ తయారయ్యిందంటే రోజుల వ్యవధిలో అది ఇండియన్‌ మార్కెట్లోనూ, దర్శనమిచ్చేస్తోంది. పైగా భద్రత విషయంలో ఏ మాత్రం రాజీపడడం లేదు. మరి మహిళలపై అఘాయిత్యాలు ఎందుకు జరుగుతున్నట్లు? అనే ఫూలిష్‌ క్వశ్చన్‌కి సరైన సమాధానమే ఉంది. అఘాయిత్యాలు పెరగడం కాదు, జరుగుతున్న అఘాయిత్యాలు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయంతే. తమకి అన్యాయం జరిగిందంటే ఇదివరకట్లా మహిళలు సమాజానికి భయపడడం లేదు. సమాజాన్ని నిలదీస్తున్నారు. పోరాడుతున్నారు. ఈ క్రమంలోనే సెల్ఫ్‌ డిఫెన్స్‌కి విపరీతమైన ప్రాధాన్యత వస్తోంది. కరాటే, కుంగ్‌ఫూ వంటి సెల్ఫ్‌ డిఫెన్స్‌ టెక్నిక్స్‌ నేర్చుకుంటూనే, స్మార్ట్‌గా ఆలోచిస్తున్నారు. కాస్త ఖరీదెక్కువైనా స్మార్ట్‌ డివైజ్‌ విషయంలో వెనుకడుకు వేయడం లేదు. తమ భద్రత ముందు, ఏదైనా చిన్న విషయమే అనే భావన మహిళల్లో పెరిగిపోయింది.

ఆపద సమయాల్లో మహిళల్ని ఆదుకోవడానికి ఈ మధ్య కాలంలో అందుబాటులోకి వచ్చిన స్మార్ట్‌ డివైజెస్‌లో స్మార్ట్‌ పెండెంట్స్‌, స్మార్ట్‌ వాచెస్‌ ముఖ్యమైనవి. తప్పించుకోలేని పరిస్థితుల్లో పెండెంట్స్‌ని జస్ట్‌ టచ్‌ చేస్తే క్షణాల్లో తమ లొకేషన్‌ తమ ఫ్రెండ్స్‌ లిస్ట్‌లో అందరికీ చేరిపోతోంది. తాము ప్రమాదంలో ఉన్నామన్న విషయాన్ని అందరికీ తెలియపరుస్తోంది. ఇదే టెక్నాలజీతో రూపొందుతోన్న స్మార్ట్‌ వాచ్‌లు మహిళలకు చాలా ఉపకరిస్తున్నాయి. ప్రమాద సమయాల్లో దుండగుల నుంచి తప్పించుకోవడానికి కొన్ని రకాలైన సాధనాలు మహిళలకు ఉపయోగపడుతున్నాయి. ఎలక్ట్రిక్‌ షాక్‌ ఇచ్చే దుస్తులు, ప్రధానంగా లోదుస్తులు మహిళల భద్రత కోసం రూపొందించి మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి కొన్ని సంస్థలు. అయితే వీటి పట్ల చాలా మంది మహిళల్లో అవగాహన పెరగాల్సి ఉంది. ఎన్ని స్మార్ట్‌ డివైజర్స్‌ అందుబాటులో ఉన్నా, ముందస్తు అప్రమత్తత చాలా ముఖ్యం. పరిస్థితుల్ని ముందుగా అంచనా వేయడం, ప్రమాదాలకు దూరంగా ఉండడం, ఎవరెలాంటి వారు అనేది తెలుసుకోవడం.. ఇవే అత్యంత ప్రాధాన్యత గల అంశాలు. సో లేడీస్‌ బీ కేర్‌ ఫుల్‌.

మరిన్ని యువతరం
maamaa maamaa