Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
dont touch

ఈ సంచికలో >> యువతరం >>

తెల్లారిందోయ్‌ మామా మామా.!

maamaa maamaa

మే వెళ్లిపోయింది. జూన్‌ వచ్చేసింది. జూన్‌ వచ్చిందంటే స్కూళ్లు తెరిచేస్తారు. స్కూళ్లు తెరిచారంటే ఇక హడావిడి. కొత్త బుక్స్‌, కొత్త యూనిఫామ్స్‌, కొత్త కొత్తగా క్లాసెస్‌. ఒక క్లాస్‌ దాటి ఇంకో క్లాస్‌కి వెళ్లే వాళ్లు. స్కూళ్లు దాటి కాలేజీలకు వెళ్లేవాళ్లు. అంతా కొత్తదనం. సందడి స్టార్ట్‌ అయిపోయింది. కాలేజీలకెళ్లే పోటీ పరీక్షలు స్టార్ట్‌ అయిపోయాయి. కొత్త కాలేజీలకు వెళ్లే వాళ్లు ఏ కాలేజీని చూజ్‌ చేసుకోవాలి. ఏ గ్రూపును ఎంచుకోవాలి అని తపన పడే వారు ఓ పక్క. కాలేజీ స్టడీస్‌ కంప్లీట్‌ చేసుకున్నవాళ్లు ఉద్యోగాల వేట కోసం తమని తాము సంసిద్ధం చేసుకునేందుకు మార్గాలు అన్వేషించే వాళ్లు మరో పక్క. ఏ ఉద్యోగంలో జాయిన్‌ ఆవ్వాలి. ఇంటర్వ్యూలకు ఏ రకంగా ప్రిపేర్‌ అవ్వాలి ఇలా ఒక్కటేమిటి రకరకాల ఆలోచనలతో స్టూడెంట్స్‌ బిజీ అయిపోవాల్సిందే. దాదాపు రెండు నెలలు అన్నింటికీ దూరంగా ఓన్లీ ఎంజాయ్‌మెంట్‌తో మైండ్‌ రీఫ్రెష్‌ చేసుకున్న విద్యార్ధులు, ఇక చదువులు, ఉద్యోగాలు అంటూ బిజీ లైఫ్‌లో పడిపోవాల్సిందే.

చదువు ఒక్కటే ముఖ్యం కాదు, చదువుతో పాటు ఏదో ఒక కోర్స్‌ పూర్తి చేస్తే, సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఏదో ఒక కొలువులో ఫిక్స్‌ కావచ్చు. అదే పనిలో ఉంది ప్రస్తుతం యువత. అందులో భాగంగా కొత్త కొత్తగా స్పెషల్‌ కోచింగ్‌ సెంటర్స్‌ పుట్టుకొస్తున్నాయి. హైద్రాబాద్‌, బెంగుళూర్‌, చెన్నై తదితర ప్రాంతాల్లో ఈ కోచింగ్‌ సెంటర్లు ఎక్కువగా క్రేజ్‌ సంపాదిస్తున్నాయి. సాఫ్ట్‌వేర్‌ రంగానికి ప్రస్తుతం అంతగా హైక్‌ లేకపోయినప్పటికీ ఆ రంగం మీదనే యువత ఎక్కువగా ఇంట్రెస్ట్‌ చూపిస్తోంది. డిగ్రీ పూర్తి చేసి, ఏదో ఒక కోర్సులో శిక్షణ తీసుకుంటే, ఏదో ఒక కొలువులో ఫిక్స్‌ అయిపోవచ్చు. అందుకే ఓ పక్క చదువు, మరో పక్క స్పెషల్‌ కోర్సులు..ఇలా తమ మైండ్‌ని ట్యూన్‌ చేసుకునే పనిలో యువత బిజీ అయిపోయింది. చదువు పూర్తయినవాళ్లు కొలువుల కోసం, ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్‌ కావాలి, ఆ టైంలో ఎలా వ్యవహరించాలి, తమ బయోడేటాని ఆకర్షణీయంగా ఎలా ప్రిపేర్‌ చేసుకోవాలో తెలియచెప్పే ప్రత్యేక శిక్షణా సంస్థలు అందుబాటులో ఉన్నాయి.. అక్కడికి వెళ్లి సదరు అంశాలపై శిక్షణ తీసుకునే దిశగా యువత పరుగులు పెడుతోంది.

మరోవైపు యువత బలహీనతను క్యాష్‌ చేసుకునేందుకు అక్రమార్కులు ప్రయత్తిస్తున్నారు. కోచింగ్‌ పేరుతో ప్లేస్‌మెంట్స్‌ ఇస్తామంటూ ముందుగా డిపాజిట్స్‌ పేరుతో డబ్బులు గుంజుతున్నారు. యువత ప్లేస్‌మెంట్‌ ఆశతో డబ్బులు వదిలించుకుంటున్నారు. తీరా సదరు సంస్థలు చివరికి బోర్డు తిప్పేయడంతో డీలా పడుతున్నారు. ఏది ఏమైనా యువతకు ఈ టైం చాలా కీలకమైనది. లైఫ్‌ టర్నింగ్‌కి కీలక నిర్ణయాలు తీసుకునేందుకు ఈ టైం ఉపయోగపడుతుంది. అందుకే ఈ టైంలో యువత ఆలోచనలు సక్రమంగా ఉండాలి. భవిష్యత్తు పూల బాటలు వేసుకునే దిశగా వారి ఆలోచనా సరళి వేసే అడుగులు వుండాలి. వేసవి సెలవులు ముగిశాయి. మళ్లీ స్కూలుకు వెళ్లాలా అనే చిన్న చిలిపి చిరాకు పక్కన పెడితే, కొత్త క్లాసులు, కొత్త చదువులు, కొత్త కొలువులు వెరసి జూన్‌ అంటే చాలా చాలా స్పెషల్‌. సంబరాలు డిశంబర్‌లో కాదు, కొత్త కొత్త బుక్స్‌, కొత్త కొత్త చదువులు, కొత్త కొత్త కొలువులు.. అసలు సిసలు సంబరం అంటే జూన్‌లోనే. లెట్స్‌ ఎంజాయ్‌ ఫోక్స్‌.!

మరిన్ని యువతరం