Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
telugu movie in african countries

ఈ సంచికలో >> సినిమా >>

శ్రీహరి మరణం తీరనిది

rip real star srihari

శ్రీహరి.. డైలాగ్ చెబితే థియేటర్ దద్దరిల్లాల్సిందే. అతని స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతం. విలనిజం అయినా, కామెడీ విలనిజం అయినా, బాధ్యతగల అన్న పాత్రల్లో అయినా, ఇంకే పాత్రలో అయినా శ్రీహరి తెలుగు తెరపై ఓ అద్భుతం అని చెప్పక తప్పదు. ఓ దశలో శ్రీహరి వుంటే చాలు తమ సినిమా హిట్టవుతుందని యువ హీరోలు అనుకునేవారు. ఓ దశలో శ్రీహరితో సినిమా చేస్తే కాసుల పంట అని నిర్మాతలు అనుకునేవారు.

కానీ, ఇప్పుడా శ్రీహరి లేడు. అర్థాంతరంగా తనువు చాలించిన శ్రీహరి తెలుగు సినిమాని శోకసంద్రంలో ముంచేశాడు. అతని మరణాన్ని తెలుగు సినీ పరిశ్రమ జీర్ణించుకోలేకపోతోంది. ‘మగధీర’ సినిమాలోని ‘చీకటి కడుపును చీల్చుకుని..’ అంటూ శ్రీహరి చెప్పిన డైలాగ్ తెలుగు సినీ పరిశ్రమలో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతుంది.

అవకాశాల కోసం తల్లడిల్లుతూ, సినీ పరిశ్రమపై ప్రేమతో అన్నీ వదిలేసుకుని వచ్చినవారికి శ్రీహరి పెద్దదిక్కుగా నిలిచేవారు. ఆయన ఇంట్లో ఎప్పుడూ చాలామందికి భోజనం పెడ్తారని ఓ పేరుంది. సినిమా అవకాశాల కోసం వచ్చి తల్లడిల్లేవారికి, కడుపు నిండా భోజనం పెట్టించే శ్రీహరి లేకపోవడం అన్నిటికన్నా బాధ కలిగిస్తోన్న అంశం.

ఓ గొప్ప నటుడు, ఓ గొప్ప వ్యక్తి.. ఎవరూ ఊహించని విధంగా తనువు చాలించి, అభిమానుల్ని శోక సంద్రంలోకి నెట్టేశాడు. బతికున్నన్నాళ్ళూ ఎంతమంది వెంట వున్నారన్నది కాదు ముఖ్యం, పోయేటప్పుడు ఎంతమంది నిన్ను తలచుకుని కన్నీరు కార్చారన్నదే ముఖ్యం. అదే నీ గొప్పదనం.. ఈ మాటలు శ్రీహరి మరణం నిజం చేసింది.

మరిన్ని సినిమా కబుర్లు
perfect actress