Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
aaditya hrudayam - vn adithya

ఈ సంచికలో >> సినిమా >>

తాండ్రపాపారాయుడు బాహుబలి

thandra paparayudu - bahubali

రెబల్ స్టార్ కృష్ణంరాజు ప్రధాన పాత్రలో వచ్చిన ‘తాండ్ర పాపారాయుడు’ సినిమా అప్పట్లో ఘనవిజయం సాధించింది. దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిందీ సినిమా. కృష్ణంరాజు నట విశ్వరూపం ఈ సినిమాలో చూడొచ్చు.  అదలా వుంటే, రెబల్ స్టార్ కృష్ణంరాజు నట వారసుడు ప్రభాస్, ‘బాహుబలి’ సినిమాలో నటిస్తున్న విషయం విదితమే. ‘బాహుబలి’ సినిమాలో ప్రభాస్ నట విశ్వరూపం చూస్తారని సినీ పరిశ్రమలో అందరూ అనుకుంటున్నారు.

రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న ఈ సినిమా కోసం ప్రభాస్ చాలా కష్టపడ్తున్నాడు. గుర్రపు స్వారీ, కత్తి ఫైటింగులు గట్రా నేర్చుకుంటున్న ప్రభాస్, ఈ సినిమాపై చాలా ఆశలే పెట్టుకున్నాడు. తెలుగు సినీ పరిశ్రమ గర్వించదగ్గ దర్శకుడిగా తన సినిమాలతో తన ప్రతిభను చాటుకున్న రాజమౌళి, ‘బాహుబలి’ టెక్నికల్ అద్భుతంగా తెరకెక్కించేందుకు ప్రయత్నిస్తున్నాడు.

ఆల్రెడీ ప్రభాస్, రాజమౌళి కాంబినేషన్లో ‘ఛత్రపతి’ రావడం, ఆ సినిమా ఘనవిజయం సాధించడం అందరికీ తెలుసు.  అందుకే వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న ‘బాహుబలి’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. రెబల్ స్టార్కి ‘తాండ్రపాపారాయుడు’లా, ప్రభాస్కి ‘బాహుబలి’ కెరీర్ లో మైల్ స్టోన్ గా నిలిచిపోతుందని వేరే చెప్పక్కర్లేదు.

మరిన్ని సినిమా కబుర్లు
will he acts with his old girlfriend?