Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
will he acts with his old girlfriend?

ఈ సంచికలో >> సినిమా >>

ఆఫ్రికాలోనూ తెలుగు సినిమా

telugu movie in african countries

తెలుగు సినిమా మార్కెట్ విస్తరిస్తోంది. తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ తెలుగు సినిమా పట్ల ఆసక్తి పెరుగుతోంది. రీమేక్ లు, డబ్బింగ్ ల విషయం అలా వుంచినట్లయితే స్ట్రెయిట్ గా తెలుగులో వచ్చే సినిమాలు ఇతర దేశాల్లోని తెలుగువారినీ పలకరిస్తున్నాయి. పెద్ద సినిమాలు ప్రపంచమంతటా విస్తరిస్తూ తెలుగు ప్రేక్షకుల్ని అలరిస్తున్నాయి.

ఆ కోవలో ‘రామయ్యా వస్తావయ్యా’ ఆఫ్రికా దేశాల్లో విడుదలవుతూ సరికొత్త సంచలనం సృష్టించేందుకు సిద్ధమయ్యింది. ఆఫ్రికా దేశాలైన టాంజానియా, నైజీరియాల్లో ‘రామయ్యా వస్తావయ్యా’ విడుదలయ్యింది. అక్కడి తెలుగువారు ఈ చిత్రం విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూశారు.

ఇప్పటికే అమెరికా మార్కెట్ తెలుగు సినిమాకి కీలకంగా మారింది. ఇతర దేశాల్లోనూ తెలుగు సినిమా ఇంకా విస్తరించి, నిర్మాతకి కాసుల వర్షం కురిపిస్తే, తెలుగు సినిమా రేంజ్ ఇంకా పెరిగిపోతుంది. హిందీ సినిమాలకు ధీటుగా తెలుగు సినిమా ప్రపంచమంతటా విస్తరిస్తున్నందుకు గర్వించాల్సిందే.

మరిన్ని సినిమా కబుర్లు
rip real star srihari